అందరూ సచిన్ అంటారు కానీ అతడే బెస్ట్: పాక్ బ్యాటర్ ని పొగిడిన సెహ్వాగ్

ఆసియా క్రికెట్ లో చాలా మంది బెస్ట్ బ్యాటర్లు ఉన్నారు. అయితే ప్రతి జట్టులో ఓపెనర్లు కూడా స్ట్రాంగ్ గా ఉండేవారు. ఇక మిడిల్ ఆర్డర్ లో కూడా ఎంతో మంది దిగ్గజాలు ఉన్నా.. సెహ్వాగ్ మాత్రం ఒక పాక్ ఆటగాడిని గ్రేట్ బ్యాటర్ గా చెప్పుకొచ్చాడు.

పాకిస్థాన్ తో ద్వైపాక్షిక సిరీస్ అంటే అభిమానులకి పండగే. దాయాదుల మధ్య సమరం క్రికెట్ చరిత్రలోనే ఎప్పటికీ స్పెషల్ గా నిలిచిపోతుంది. ముఖ్యంగా 2000 సంవత్సరం తర్వాత ఈ మజా పీక్స్ కి వెళ్ళిపోయింది. 90ల్లో భారత్ పై పాక్ ఆధిపత్యం చూపించినా.. 2000 దశాబ్దంలోకి అడుగు పెట్టిన తర్వాత భారత్ దే పై చేయవు కావడం విశేషం. ఇక ఐసీసీ టోర్నీల్లోనైతే పాక్ కి ప్రతిసారి పరాభవమే ఎదురయ్యేది. ఈ రెండు జట్ల మధ్య ఎన్నో గొప్ప మ్యాచులు జరిగాయి. ప్లేయర్లు కూడా ఎంతో ఛాలెంజింగ్ గా ఆడుతూ ఆ తర్వాత సరాదాగా కలిసిపోయేవారు. ముఖ్యంగా వీరేంద్ర సెహ్వాగ్ అందరితోనూ ఎంతో సరాదాగా కలిసిపోయేవాడు. ఈ సందర్భంగా పాకిస్థాన్ మాజీ కాపాడిన ఇంజమామ్ ఉల్ హక్ ని గురించి కొన్ని ఆసక్తికర కామెంట్లు చేసాడు.

ఆసియా క్రికెట్ లో చాలా మంది బెస్ట్ బ్యాటర్లు ఉన్నారు. అయితే ప్రతి జట్టులో ఓపెనర్లు కూడా స్ట్రాంగ్ గా ఉండేవారు. ఇక మిడిల్ ఆర్డర్ లో కూడా ఎంతో మంది దిగ్గజాలు ఉన్నా.. సెహ్వాగ్ మాత్రం ఇంజమామ్ ని గ్రేట్ బ్యాటర్ గా చెప్పుకొచ్చాడు. సెహ్వాగ్ మాట్లాడుతూ.. “అందరూ సచిన్ టెండూల్కర్ గురించి చెబుతారు కానీ ఇంజమామ్ వుల్ హక్, ఆసియాలోనే బిగ్గెస్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్. సచిన్‌కి ఎవ్వరితో పోటీ లేదు. ఆయన అందరి కంటే పైనున్నాడు. సచిన్ పాజీ కాకుండా మిగిలిన ప్లేయర్లలో బెస్ట్ అంటే నాకు ముందుగా గుర్తుకువచ్చేది ఇంజమామ్. రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్, కుమార సంగర్కర, మహేళ జయవర్థనే ఇతరత్రా శ్రీలంక, ఇండియా, పాకిస్తాన్ బ్యాటర్ల కంటే ఇంజమామ్ వుల్ హక్ చాలా సుపీరియర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్. అతని కంటే బెటర్ బ్యాటర్‌ని నేనైతే చూడలేదు..
అని సెహ్వాగ్ ఇంజమామ్ మీద ప్రశంసల వర్షం కురిపించాడు.

పాక్ తరపున ఇంజమామ్ 378 వన్డేలు ఆడాడు. 11,739 పరుగులు చేసిన ఈ మాజీ పాక్ కెప్టెన్ ఖాతాలో 10 సెంచరీలు, 83 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఒక దశలో అత్యధిక అర్ధ సెంచరీలతో ప్రపంచ రికార్డుని సృష్టించాడు. తర్వాత ఈ రికార్డుని సచిన్ టెండూల్కర్ బ్రేక్ చేసాడు. ఇక 120 టెస్టుల్లో 8830 పరుగులు చేశాడు. ఇందులో ఒక త్రిబుల్ సెంచరీ ఉండడం విశేషం. ఘనతలు సాధించిన ఇంజమామ్ వుల్ హక్ కి రావాల్సిన గుర్తింపు రాలేదు. కానీ సెహ్వాగే మాత్రం అందరికన్నా గొప్ప బ్యాటర్ గా కితాబులిచ్చాడు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed