అనిల్ కుంబ్లే తర్వాత టీమిండియా కోచ్ పదవి నాకే దక్కాల్సింది అని షాకింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్. అదీకాక అప్పటి బీసీసీఐ ప్రధాన కార్యదర్శితో పాటుగా విరాట్ కోహ్లీ నన్ను టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలు స్వీకరించాలని కోరారు అంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు సెహ్వాగ్.
ప్రపంచ క్రికెట్లో టీంఇండియా కోచ్ గా ఉండడం చాలా గౌరవంతో కూడుకున్న విషయం. అయితే.. ఇండియన్ క్రికెట్ కోచ్ పదవి కత్తిమీద సాములాంటిది. దానికి ప్రధాన కారణం దేశంలో క్రికెట్ కి విపరీతమైన క్రేజ్ ఉండడమే. ఒక కోచ్ గా గెలిచినప్పుడు ఎంత ప్రశంసలు వస్తాయో, ఓడిపోతే అంతకన్నా ఎక్కువగా విమర్శలు మూట కట్టుకోవాల్సి ఉంటుంది. భారత జట్టుకి కోచ్ అంటే అందరు ఆసక్తి చూపించినా.. ఒక్కసారి కోచ్ పదవీ బాధ్యతలు చేపట్టాక చాలా సవాళ్ళను అధిగమించాల్సి ఉంటుంది. భారత్ జట్టుకి కోచ్ అవసరం ఉన్నప్పుడు దరఖాస్తులు చాలా మొత్తం లో వస్తుంటాయి. అయితే ఈ విషయంలో మాత్రం టీంఇండియా ఒకప్పటి స్టార్ ఓపెనర్, డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ కాస్త భిన్నంగా స్పందించాడు. తాను టీమిండియాకు కోచ్ గా ఉండాలని బీసీసీఐ తనను అడిగినట్లు చెప్పుకొచ్చాడు.
ప్రపంచ క్రికెట్ కి వీరేంద్ర సెహ్వాగ్ అంటే పరిచయం అవసరం లేదు. దూకుడే మంత్రంగా, బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తాడు ఈ డాషింగ్ ఓపెనర్. సచిన్, ద్రావిడ్ , గంగూలీ, లక్ష్మణ్ లాంటి దిగ్గజాలు ఉన్నా.. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు ఈ వీరేంద్రుడు. గ్రౌండ్ లో విధ్వసం సృష్టించే సెహ్వాగ్ బయట మాత్రం అందరితో చాలా సరదాగా ఉంటాడు. తనదైన శైలిలో కౌంటర్లు, పంచ్ లు విసరడంతో దిట్ట. దీంతో ఈ విధ్వంసకర బ్యాటర్ భారత కోచ్ గా మారితే.. భారత్ జట్టు మరింత దూకుడుగా ముందుకు వెళ్లొచ్చు అనే ఆలోచన కూడా సగటు క్రికెట్ అభిమానిలో ఉండేది. అయితే క్రికెట్ లో ఇంతగా క్రేజ్ సంపాదిచుకున్న సెహ్వాగ్ భారత జట్టుకి కోచ్ పదవి చేపట్టాలని ఆఫర్ వచ్చిందని తానే స్వయంగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో సంచలంగా మారాయి. తాజాగా.. ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో భాగంగా.. కోచ్ పదవికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
సెహ్వాగ్ మాట్లాడుతూ.. “విరాట్ కోహ్లీ, బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి నన్ను కలవకపోయి ఉంటే నేను భారత జట్టు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేవాడిని కాదు. మా ముగ్గురి మధ్య సమావేశాం జరిగింది. కోచ్ అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లీ మధ్య అంతగా సఖ్యత కుదరట్లేదు. అందువల్ల మీరు కోచ్ పదవి తీసుకోవాలని బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ నన్ను కోరారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం కోచ్ గా కుంబ్లే గడువు ముగుస్తుంది. అనంతరం మీరు భారత జట్టు కోచ్ గా వెస్టిండీస్ లో పర్యటించాల్సి ఉంటుందని తెలియజేసారు. దీంతో నేను నా నిర్ణయాన్ని తెలియజేయలేదు గాని.. వెస్టిండీస్ లో పర్యటించాలంటే నాకొక సహాయక సిబ్బంది, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ కావాలని నా నిర్ణయాన్ని తెలియజేశాను. ఈ క్రమంలో సహాయక సిబ్బందిని కూడా నేను ఎంపిక చేయాలన్నాను. వారు నాకు ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. దీంతో నేను వెస్టిండీస్ కి వెళ్ళలేదు”. అని సెహ్వాగ్ వివరించాడు. అయితే.. అనిల్ కుంబ్లే అనంతరం రవి శాస్త్రీ టీమిండియా కోచ్ గా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా ఎన్నో మర్చిపోలేని విజయాలను సొంతం చేసుకుంది. భారత జట్టు కోచ్ గా ఎంతో పోటీ ఉన్న నేపథ్యంలో సెహ్వాగ్ కి ఇలాంటి ఆఫర్ రావడం మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలుపండి.