బుల్లెట్ వేగంతో దూసుకొస్తూ బ్యాటర్లను భయపెట్టే బంతులు, విచిత్రమైన బౌలింగ్ యాక్షన్, వివాదాల కెరీర్‌తో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది. తన స్పీడ్ బౌలింగ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అక్తర్ ఎంతో మంది బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. అక్తర్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు చాలా మంది క్రికెటర్లు భయపడేవారంటే అతిశయొక్తి కాదు. అత్యంత వేగంతో బంతులు వేస్తూ బ్యాటర్లకు సవాలు విసిరేవాడు.
ఇలా అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అక్తర్ కెరీర్‌లో ఎత్తు పల్లాలు కూడా ఉన్నాయి. ఒకానొక దశలో అక్తర్ బౌలింగ్ యాక్షన్‌పై సందేహాలు లెవనెత్తి ఐసీసీ నిషేధం కూడా విధించింది. అలాగే టీమిండియా ఆటగాళ్లతో వివాదాలు కూడా అక్తర్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ అంశాలే. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను 99 పరుగుల వద్ద క్వీక్ బౌన్సర్ వేసి అవుట్ చేసిన ఘనత అక్తర్‌కు ఉంది.
అనేక ఆసక్తికర విషయాలతో కూడిన అక్తర్ జీవితం గురించి వచ్చే ఏడాది బయోపిక్ రానుంది. తన జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను నిర్మిస్తున్నట్లు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సోమవారం ప్రకటించాడు. ఈ బయోపిక్‌కు ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్’గా నామకరణం కూడా చేశారు. రావల్పిండి ఎక్స్‌ప్రెస్ అనేది అక్తర్‌కు క్రికెట్‌లో నిక్‌నేమ్‌గా ఉండేది. అక్తర్ సొంత నగరం రావల్పిండి.. అందుకే అతన్ని రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పిలిచేవారు.
కాగా అక్తర్ తన బయోపిక్ ప్రకటించగానే ఇండియన్ క్రికెట్ అభిమానుల్లో ఒక ఆసక్తి నెలకొంది. అదేంటంటే.. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ షోయబ్ అక్తర్ బౌలింగ్‌ను చీల్చిచెండాడిన విషయాన్ని బయోపిక్‌లో చెబుతారా? లేదా అని. 2004లో ముల్తాన్ టెస్టులో సెహ్వాగ్ తొలి ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. 309 పరుగులతో భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక పరుగులు, తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా సెహ్వాగ్ రికార్డు సృష్టించాడు.
ఆ మ్యాచ్‌లో సెహ్వాగ్ 375 బంతుల్లో 39 ఫోర్లు, 6 సిక్సులతో 309 పరుగులు చేశాడు. సెహ్వాగ్ వీరబాదుడికి టీమిండియా 675 పరుగుల భారీ స్కోర్ చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కాగా ఆ మ్యాచ్‌లో షోయబ్ అక్తర్ 32 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 119 పరుగులు సమర్పించుకున్నాడు. అతనికి ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఒక మ్యాచ్‌ను భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలిచింది.
ఇలా ముల్తాన్ టెస్టులో షోయబ్ అక్తర్ బౌలింగ్‌లో సెహ్వాగ్ దంచికొట్టిన తీరు అప్పట్లో సంచలనంగా మారింది. ఎందుకంటే కెరీర్ తొలినాళ్లలో సెహ్వాగ్ అక్తర్ బౌలింగ్‌ను ఇబ్బంది పడే వాడు. ఒక మ్యాచ్‌లో సెహ్వాగ్‌కు షార్ట్ బౌన్సర్లు వేస్తూ దమ్ముంటే కొట్టి చూపించు అని కవ్వించాడు. అప్పుడు సెహ్వాగ్ అదిగో మరోఎండ్‌లో ఉన్నాడు చూడు నీ బాప్ అతని వేసి చూపించు అని సచిన్ చూపిస్తూ అన్నాడు. మరుసటి ఓవర్‌లో సచిన్‌కు అలాంటి బాల్ వేయగా.. దాన్ని సచిన్ అప్పర్ కట్‌తో సిక్సర్‌గా మలుస్తాడు.
అప్పడు సెహ్వాగ్ అక్తర్‌తో.. ‘బేటా.. బేటా హోతాహై అవుర్ బాప్.. బాప్ హోతాహై’ అంటూ బుద్దిచెబుతాడు. ఈ విషయాన్ని సెహ్వాగే స్వయంగా వెల్లడించాడు. మరి ఈ విషయాలన్నీ అక్తర్ బయోపిక్‌లో ఉంటాయా? అంటూ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వేదికగా అడుగుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Q & A for half an hour about this & a lot more. Use the hashtag #RawalpindiExpressTheFilm and you may get lucky with a response. pic.twitter.com/xasTnvvfNH
— Shoaib Akhtar (@shoaib100mph) July 24, 2022