మన్కడింగ్.. మొదటగా ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది రవిచంద్రన్ అశ్విన్. ఐపీఎల్ 2019 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్‌గా ఉన్న రవిచంద్రన్ అశ్విన్.. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన జోస్ బట్లర్‌ను ఓ లీగ్ మ్యాచ్‌లో మన్కడింగ్ చేశాడు. అశ్విన్ బౌలింగ్ చేస్తుండగా.. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న జోస్ బట్లర్ క్రీజు దాటి ముందుకు రావడంతో అతడిని ఔట్ చేశాడు. ఈ ఘటనపై అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. అశ్విన్ చేసిన పని అనైతికం అంటూ అభిమానులు, మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. అయితే, అశ్విన్ ఎప్పటికప్పుడూ తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ వచ్చాడు.
క్రికెట్‌లో మన్కడింగ్.. క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అనే చర్చకు ముగింపు పలుకుతూ.. క్రికెట్ చట్టాలను సంరక్షించే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) కీలక మార్పులు చేసింది. మన్కడింగ్‌ను రనౌట్ కేటగిరిలోకి మార్చింది. అలాగే, బంతిపై మెరుపు తెచ్చేందుకు ఉమ్మి రుద్దడాన్ని శాశ్వతంగా నిషేధించింది. కొత్త బ్యాటర్ ఎటువైపు బ్యాటింగ్ చేయాలనే రూల్‌ను కూడా మార్చింది. అయితే, ఇవన్నీ ఈ ఏడాది అక్టోబర్‌లో అమల్లోకి రానున్నాయి. ఈ లోగా అంతర్జాతీయంగా అంపైర్లు, అధికారులకు సరైన శిక్షణ ఇవ్వనుంది. అయితే మన్కడింగ్‌ను రనౌట్‌గా మార్చడంపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో స్పందించాడు.
ఇది కూడా చదవండి : షేన్ వార్న్ కోసం ఎంతో ఇష్టంగా వండితే.. తినలేదు: సచిన్మన్కడింగ్ నిబంధనల్లో మార్పు చేయడంతో.. అశ్విన్‌కు మరింత స్వేచ్ఛ దొరికినట్లయిందని సరదాగా ట్వీట్ చేశాడు. ‘కంగ్రాట్స్ అశ్విన్.. ఈ వారం నీకు బాగా కలిసొచ్చింది. టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా రికార్డు సృష్టించావు. బట్లర్‌తో కలిసి రనౌట్లను ప్లాన్ చేయడానికి మరింత స్వేచ్ఛ లభించింది.’ అంటూ సెహ్వాగ్ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. ఇక అభిమానులు ఈ ట్వీట్‌పై ఫన్నీగా స్పందిస్తున్నారు. అశ్విన్ ట్రెండ్ ఫాలోవర్ కాదని, ట్రెండ్ సెట్టర్ అంటూ సినిమా డైలాగ్స్ కామెంట్ చేస్తున్నారు.
Congratulations @ashwinravi99, great week this one. First becoming second highest wicket taker in Tests for India, and now this. Ab full freedom to plot such run-outs with Buttler.
Ek karna zaroor 😊 https://t.co/oCjfYdr6nr— Virender Sehwag (@virendersehwag) March 9, 2022