అభిమానానికి అవధులు ఉండవు.. మన దేశమా? కాదా? రంగు.. వేషం.. కట్టుబాట్లు మనకు నచ్చాలే గానీ ఇవేమీ పట్టించుకోం. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే ఈ అభిమానం తారా స్థాయిలో ఉంటుంది అనడంలో సందేహం లేదు. అయితే ఇండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీకి మన దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే క్రమంలోనే ఓ కుర్ర అభిమానికి కోహ్లీ ఆటోగ్రాఫ్ ఇచ్చే వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఆసియా కప్ 2022లో భాగంగా భారత్ తాజాగా హాంకాంగ్ తో తలపడింది. ఈ మ్యాచ్ కోసం ఇండియా జట్టు మైదానానికి వెళ్తున్న క్రమంలో ఓ బాలుడు కోహ్లీ వైపు దూసుకెళ్లడానికి పరిగెత్తుకుంటూ స్పీడ్ గా వచ్చాడు. ఆ కుర్రాడిని సెక్యూరిటీ సంకలోకి తీసుకుని అడ్డుకున్నాడు. అక్కడే ఉన్న విరాట్ దీన్ని గమనించాడు. అదీ కాక ఆ పిల్లాడిని పిలిచి మరీ ఆటోగ్రాఫ్, సెల్పీ ఇచ్చాడు. తన అభిమాన ఆటగాడి కోసం ఆ పిల్లాడు ఎంత ఆరాట పడ్డాడో ఈ వీడియో చూస్తే అర్ధం అవుతోంది. కానీ జింక పిల్లని పులి అందుకున్నట్లు ఆ పిల్లాడిని సెక్యూరిటీ సంకలోకి అందుకున్నాడు.
ఇక తన అభిమాన ఆటగాడితో ఫొటో దిగితే ఎలా ఉంటుందో మనందరికి తెలిసిందే. ఇప్పుడు అదే ఆనందాన్ని ఆ బాలుడు పొందాడు. బ్యాట్ పై ఆటోగ్రాఫ్ తీసుకున్న తరువాత వెళ్లబోయిన ఈ పిల్లాడు కొంత దూరం వెళ్లి మళ్లీ తిరిగి వచ్చి కోహ్లీతో ఏదో మాట్లాడాడు. అతడిని చూసిన విరాట్ నవ్వుతూ.. పిల్లాడి వెన్ను తట్టి పంపించాడు. విరాట్ తన ఫ్యాన్స్ విషయంలో ఎప్పుడూ సరదాగ ఉంటాడు అనడానికి ఈ వీడియోనే నిదర్శనంగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ వీడియోని చూసిన విరాట్ అభిమానులు సర్ అందుకే మీర్ మాకు కింగ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మెున్నటికి మెున్న కోహ్లీ సంతకం చేసిన జెర్సీ కోసం పాక్ ఆటగాళ్లు చూపిన ఆసక్తి గురించి మనకు తెలిసిందే. విరాట్ తన అభిమానులకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఇస్తూ ఉంటాడని మరో సారి ఈ వీడియో నిరూపించింది. మరి తన కుర్ర అభిమానిపై కోహ్లీ చూపిన ప్రేమ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Watch how Virat Kohli made the day of a young li’l fan🫶@imVkohli #ViratKohli𓃵 pic.twitter.com/hnsnhEAAGw
— iᴍ_Aʀʏᴀɴ18 (@crickohli18) August 30, 2022