క్రికెట్ లో ఫిట్ నెస్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే ఒకే ఒక్క పేరు కింగ్ విరాట్ కోహ్లీ. కోహ్లీ ఫిట్ నెస్ గురించి తెలియని వాళ్లు ఉండరు. ఈ క్రమంలోనే తాజాగా విరాట్ కోహ్లీ తినే ఫుడ్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక విరాట్ తినే బియ్యం ఖరీదు తెలిస్తే మనం షాక్ అవ్వాల్సిందే.
క్రీడా ప్రపంచంలో ఆటగాళ్లకు ఉండాల్సింది ఫిట్ నెస్. ఆటగాళ్లు ఎంత ఫిట్ గా ఉంటే మైదానంలో అంత వేగంగా కదులుతారు. ఇక ఫిట్ నెస్ లేని ఆటగాళ్లు గ్రౌండ్ లో ఎలా ఉంటారో మనందరికి తెలిసిందే. అయితే క్రికెట్ లో ఫిట్ నెస్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే ఒకే ఒక్క పేరు కింగ్ విరాట్ కోహ్లీ. కోహ్లీ ఫిట్ నెస్ గురించి తెలియని వాళ్లు ఉండరు. కాగా విరాట్ సైతం తన ఫిట్ నెస్ పై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటాడు. తాగే వాటర్ దగ్గర నుంచి తినే తిండి వరకు స్పెషల్ కేర్ తీసుకుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా విరాట్ కోహ్లీ తినే ఫుడ్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక విరాట్ తినే బియ్యం ఖరీదు తెలిస్తే మనం షాక్ అవ్వాల్సిందే.
విరాట్ కోహ్లీ.. వరల్డ్ క్రికెట్ ను తన బ్యాట్ తో శాసిస్తూ.. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. మరి ఇన్ని పరుగులు, అన్ని రికార్డులు సాధించడం చిన్న విషయం కాదు. సూదీర్ఘ కెరీర్ లో గాయాలు కాకుండా, ఫిట్ నెస్ ను కాపాడుకుంటూ.. కొనసాగడం అంటే కత్తిమీద సాము అనే చెప్పాలి. అందుకు ఆటగాళ్లు ఫిట్ నెస్ పై, ఫుడ్ పై ప్రత్యేక దృష్టి పెడుతుంటారు. ఇక విరాట్ కోహ్లీ తన ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడని మీకు తెలుసా? పెరుగు, పాల ఉత్పత్తులను, గోధుమ పిండి చపాతీలను కోహ్లీ దూరంగా ఉంటాడు. అదీకాక విరాట్ తన ఆహారంలో కార్బోహైడ్రేట్లను ఎక్కువగా తీసుకోడు.
ఇక కోహ్లీ తన కోసం స్పెషల్ రైస్ ను తెప్పించుకుంటాడని సమాచారం. ఈ బియ్యాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ లో ప్రత్యేకంగా తయ్యారు చేస్తారు. ఇక ఈ బియ్యం గ్లూటెన్ రహితంగా, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఇక ఈ బియ్యం ధర వచ్చేసి కిలో ధర రూ. 400 నుంచి రూ. 500 వరకు ఉంటుందని సమాచారం. ఇక ఈ రేటు తెలిసిన అభిమానులు మరి ఆ ఫిట్ నెస్ ను మెయింటైన్ చేయాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టాలి అంటున్నారు అభిమానులు. మరి విరాట్ కోహ్లీ తన ఫిట్ నెస్ కోసం అంత కాస్ట్లీ బియ్యం తినడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.