“ఓటమి నుంచే పాఠాలు నేర్చుకోవాలి” ఇది టీమిండియా కు తెలిసొచ్చింది అనుకుంటా. అందుకే రాబోయే సిరీస్ లకు కఠిన శిక్షణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే నేటి నుంచి ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. అందులో భాగంగానే టీమిండియా ఆటగాళ్లు నెట్స్ లల్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రయోగాలు చేస్తున్నట్లు భాహటంగానే చెప్పాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ లల్లో ఆరు లేదా ఏడుగురు బౌలర్లతో బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించాడు. రోహిత్ చేసిన ఈ ప్రకటన వెనుక భారీ ప్లానే ఉందంటున్నారు క్రీడా నిపుణులు. ఇది టీ20 ప్రపంచ కప్ కోసమే అంటున్నారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
విరాట్ కోహ్లీ.. రన్ మిషన్ గా మనందరికి సుపరిచితుడే. కింగ్ కోహ్లీ కేవలం బ్యాటర్ గానే మనందరికి తెలుసు.. కానీ అతడిలో ఓ బౌలర్ కూడా ఉన్నడని కొంత మందికే తెలుసు. తాజాగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం బౌలింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు విరాట్. భారత బౌలర్లు అయిన ఉమేష్ యాదవ్, బుమ్రాల బౌలింగ్ లల్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన కోహ్లీ. ఆ తరువాత బౌలర్ గా అవతారం ఎత్తి దాదాపు అరగంట సేపు బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. అయితే కోహ్లీతో బౌలింగ్ ప్రాక్టీస్ చేయించింది టైమ్ పాస్ కోసం కాదు. దానికి ఓ ప్లానే రడీ చేశాడు రోహిత్ శర్మ. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్ ల తర్వాత వెంటనే ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచ కప్ జరగనుంది. సహజంగానే ఆసిస్ పిచ్ లు సీమ్ కు బాగా ఉపకరిస్తాయి. దాంతో మీడియం ఫాస్ట్ వేస్తూ.. కొద్దిగా స్వింగ్ చేయగల బౌలర్లకు అక్కడి పిచ్ లు స్వర్గధామం.
అందుకే ఇప్పటి నుంచే దానికోసం కోహ్లీతో రోహిత్ పావులు కదుపుతున్నాడని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక రోహిత్ అనుకున్నదే కనుక నిజం అయితే విరాట్ ఆరో బౌలర్ గా అందుబాటులోకి రావడం ఖాయం. అందులో భాగంగానే అతడితో బౌలింగ్ ప్రాక్టీస్ చేయిస్తున్నాడు. ఈ విషయాన్ని కూడా రోహిత్ శర్మ ప్రెస్ మీట్ లో చెప్పకనే చెప్పాడు. ఆస్ట్రేలియా పిచ్ లు ఉపఖండపు పిచ్ లలా కాదు. అక్కడి పిచ్ లు సీమర్లకు బాగా సహకరిస్తాయి. ఈ పిచ్ లపై స్పిన్నర్ల కంటే మీడియం సీమ్ వేసేవాళ్లే ఎక్కువ ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువ.. అందుకే కోహ్లీని బౌలర్ గా బరిలోకి దింపాలని రోహిత్ భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రోహిత్ ప్లాన్ వర్కౌట్ అవుతుందో.. కాదో మరికొన్ని రోజులు వేచిచూస్తే కానీ తెలీదు. ప్రస్తుతం విరాట్ బౌలింగ్ చేస్తున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి కోహ్లీ భారత్ కు బౌలర్ గా ఉపయోగపడతాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Look who’s opening bowling tomorrow 🤪 #IndvsAus @imVkohli @BCCI #viratkohli #virat #kohli #cricket #fans #TeamIndia #India pic.twitter.com/bR2W9mqZD9
— Punjab Cricket Association (@pcacricket) September 19, 2022
Preps ✅#TeamIndia set for the 1⃣st #INDvAUS T20I! 👍 👍 pic.twitter.com/R07qPSsNlO
— BCCI (@BCCI) September 20, 2022