టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో మూడు రోజుల్లో బరిలోకి దిగనున్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న కోహ్లీ.. ఈ నెల 27న ప్రారంభం కానున్న ఆసియా కప్‌తో టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే జట్టుతో కలిసి కుటుంబ సమేతంగా యూఏఈ చేరుకున్నాడు. ఈ నెల 28న పాకిస్థాన్‌తో మ్యాచ్‌తో కోహ్లీ గ్రౌండ్‌లోకి దిగనున్నాడు. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్‌కు తోడు విరాట్ కోహ్లీ లాంగ్‌గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తుండడంతో మరింత ఆసక్తి నెలకొంది. గత కొంత కాలంగా ఫామ్‌లోని కోహ్లీ.. రెస్ట్ తర్వాత ఎలా ఆడుతాడో అనే టెన్షన్ అభిమానుల్లో ఉంది.
ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఒక భారీ మార్పుతో బరిలోకి దిగుతూ మరింత టెన్షన్ పెంచుతున్నాడు. ఆసియా కప్‌లో కోహ్లీ ఒక కొత్త బ్యాట్‌తో ఆడనున్నాడు. ఎంఆర్‌ఎఫ్ స్పాన్సర్ చేసే బ్యాట్‌తో ఆడే కోహ్లీ.. అందులోనే కొత్త ఎడిషన్ గోల్డ్‌తో బరిలోకి దిగనున్నాడు. గతంలో రెడ్ కలర్‌లో ఉండే ఎంఆర్‌ఎఫ్ ఫాంట్ కొత్త బ్యాట్‌పై ప్లేయిన్‌గా బ్లాక్ కలర్‌లో ఉండనుంది. ఈ బ్యాట్ ఖరీదు గతంలో వాడిన బ్యాట్ ధర కంటే చాలా ఎక్కువని సమాచారం. కాగా కోహ్లీ ఆడే బ్యాట్లన్ని ఎఫ్‌ఆర్‌ఎఫ్ కంపెనీ స్పాన్సర్ చేయడంతో కోహ్లీకి బ్యాట్ ధరతో ఎలాంటి ఫరక్ పడదు. అలాగే పాత మోడల్ బ్యాట్‌కు ఈ కొత్త బ్యాట్ బరువులో కానీ, ఎత్తులో కానీ ఎలాంటి తేడా లేదని తెలుస్తుంది. మరి ఈ కొత్త ఎడిషన్ బ్యాట్‌తో అయిన కోహ్లీ ఫామ్‌లోకి వస్తాడా? రాడో? అని కోహ్లీ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ద్రవిడ్ నుంచి సెహ్వాగ్ స్టైల్‌కు మారుతున్న పుజారా! టార్గెట్ అదేనా..?