ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియా ఆడే అన్ని మ్యాచ్‌లను చూడని వారు, క్రికెట్‌పై అంతగా ఇంట్రస్ట్ లేనివాళ్లు సైతం పాకిస్థాన్‌తో మ్యాచ్ అనగానే ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షి సిరీస్‌లు లేని కారణంగా.. పెద్దపెద్ద టోర్నీల్లోనే రెండు జట్ల మధ్య మ్యాచ్‌లు చూసే అవకాశం లభిస్తుంది. దీంతో దాయాదుల పోరుకు మరింత డిమాండ్ ఏర్పడింది.
ఈ నేపథ్యంలో ఈ నెల 28న ఆసియా కప్ వేదికగా ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. దీని గురించి క్రికెట్ అభిమానులు ఇప్పటికే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌తో పాటు టీమిండియాలో విరాట్ కోహ్లీ ఉంటాడా? ఉండడా అనే అనుమానుల సైతం క్రికెట్ ఫ్యాన్స్‌లో వ్యక్తం అవుతున్నాయి. అందుకు కారణం.. ప్రస్తుతం కోహ్లీ విశ్రాంతిలో ఉన్నాడు. వెస్టిండీస్, జింబాబ్వే సిరీస్‌ల నుంచి కోహ్లీకి రెస్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కాస్త గ్యాప్‌ను విరాట్ కోహ్లీ రిఫ్రెష్ అయ్యేందుకు ఉపయోగించుకుంటున్నాడు.
ఈ రెస్ట్ కంటే ముందు విరాట్ కోహ్లీ సరైన ఫామ్‌లోని లేని విషయం తెలిసిందే. విశ్రాంతిలో మరింత ప్రాక్టీస్ చేసి ఫామ్‌లో వచ్చేందుకు కోహ్లీ ప్రయత్నిస్తాడని అంతా భావించినా కోహ్లీ ప్రాక్టీస్ చేయడంలేదు. అలాగే కోహ్లీ రెస్ట్ ఇస్తున్న సమయంలో ఆసియా కప్‌తో కోహ్లీ జట్టులోకి వస్తాడని సెలెక్టర్లు వెల్లడించారు. దీంతో ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగే తొలి మ్యాచ్‌తోనే కోహ్లీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ.. ఫామ్ దృష్ట్యా కోహ్లీని తొలి మ్యాచ్‌లోనే ఆడిస్తారా? అనేది ఆలోచించాల్సిన విషయమే.
జట్టులో కోహ్లీ ఎందుకు ఉండాలి..?
ఆసియా కప్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడనుంది. మెగా టోర్నీల్లో పాక్‌పై ఎప్పుడూ ఆధిపత్యం చెలాయించే టీమిండియా.. గత టీ20 వరల్డ్ కప్‌లో మాత్రం పాక్ చేతిలో ఓడిపోయింది. పాక్ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూకట్టారు. కానీ కెప్టెన్ కోహ్లీ ఒక్కడే పాక్ స్పీడ్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని హాఫ్ సెంచరీతో రాణించాడు. కోహ్లీ ఆ రోజు ఒంటరి పోరాటం చేయబట్టి టీమిండియా ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. లేకుంటే తక్కువ స్కోర్‌కే కుప్పకూలేది.
లెఫ్టార్మ్ సీమర్లను ఎదుర్కొవడంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ వర్మ, కేఎల్ రాహుల్ ఇబ్బంది పడుతుంటారు. షాహీన్ అఫ్రిది, హసన్ అలీ లాంటి బౌలర్లను ఎదుర్కొవడం రోహిత్, రాహుల్‌కు అంత సులవైన విషయం కాదు. ఇలాంటి బౌలింగ్‌ను ఆడాలంటే జట్టులో కోహ్లీలాంటి ప్లేయర్ అవసరం ఎంతైనా ఉంది. నిజానికి ఫామ్‌లో లేని కోహ్లీ రెస్ట్ తీసుకున్నదే మానసిక, శారీరక ప్రశాంతత కోసం. చాలా రోజులుగా అవిశ్రాంతంగా క్రికెట్ ఆడుతున్న కోహ్లీకి కొంత విశ్రాంతి అవసరం అని మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడ్డారు.
కోహ్లీకి కూడా ఆ విషయం అర్థమై తన కెరీర్‌లో తొలి సారి పెద్దగ్యాప్ తీసుకున్నాడు. రెస్ట్ తర్వాత ఫ్రెష్‌మైండ్‌తో వచ్చి ఫామ్ అందుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కోహ్లీకి ఒక్క మంచి ఇన్నింగ్స్ చాలు ఫామ్‌లోకి రావడానికి. కోహ్లీ కమ్‌బ్యాక్‌కు పాకిస్థాన్‌తో మ్యాచ్ కంటే మంచి వేదిక లేదు. పాక్‌తో మ్యాచ్ అంటే రెచ్చిపోయే కోహ్లీ.. కచ్చితంగా ఆసియా కప్‌లో పాక్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. మరి కోహ్లీ లాంగ్ గ్యాప్ తర్వాత పాక్‌తో మ్యాచ్ ఆడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Who’s ready for 𝐚𝐭 𝐥𝐞𝐚𝐬𝐭 TWO matches between India & Pakistan this calendar year?🤩#AsiaCup2022 pic.twitter.com/urrzB1cbKN
— Sport360° (@Sport360) August 2, 2022
We all know what happened when both sides last met in Dubai 😉#AsiaCup2022 #PAKvIND pic.twitter.com/yvEaoyi4bW
— Cricket Pakistan (@cricketpakcompk) August 2, 2022
Ready for this Epic Battle 😎 Mark your Dates #AsiaCup2022 #INDvsPAK pic.twitter.com/Hx4xNgh6X7
— Toothless Brain (@RPIndoAry) August 2, 2022
Get ready to witness Asia’s best, battling it out to become Asia’s best!🔥👊
Here’s how this year’s Men’s #AsiaCup2022 is lined up. pic.twitter.com/g2SK2UnlhO— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) August 2, 2022
My favourite shade of blue 💙📞 pic.twitter.com/K6nR1sJMd7
— Virat Kohli (@imVkohli) July 26, 2022
It’s so disappointing to see some people hating/trolling Virat Kohli for this knock against Pakistan. I mean seriously India lost Rohit for Duck and then we were 31/3 after 6 overs,had Kohli not played this innings we would have not even scored 100 runs #fact pic.twitter.com/gnrk1v7q38
— Cricket 🏏 Lover // Bumrah is GOAT (@CricCrazyV) August 2, 2022
Perspective pic.twitter.com/yrNZ9NVePf
— Virat Kohli (@imVkohli) July 16, 2022