టీమిండియా వన్డే జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని బీసీసీఐ తప్పించిన విషయం తెలిసిందే. దీనిపై కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఒక గొప్ప ఆటగాడిని, టీమిండియా బెస్ట్ కెప్టెన్‌ను ఈ విధంగా అవమానిస్తారా? అంటూ ఫైర్ అవుతున్నారు. కానీ ఇదే సమయంలో ఆర్సీబీ మేనేజ్‌మెంట్ నుంచి వినిపిస్తున్న వార్త ఒకటి ఆనందాన్ని ఇస్తుంది. అదేంటంటే.. RCB కెప్టెన్‌గా మళ్లీ కోహ్లీనే నియమించేందుకు టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై కోహ్లీతో చర్చలు జరిపి ఒప్పించాలని RCB యాజమాన్యం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.
వన్డే కెప్టెన్సీ పొవడానికి ముందు విరాట్ కోహ్లీ టీమిండియా టీ20 కెప్టెన్సీని, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్సీని వదులుకున్న విషయం తెలిసిందే. టీమిండియా వన్డే, టెస్ట్ జట్లకు కెప్టెన్‌గా కొనసాగుతానని అప్పట్లో కోహ్లీ ప్రకటించాడు. కాగా బీసీసీఐ విరాట్‌ను వన్డే కెప్టెన్‌గా తప్పించి.. ఆ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించింది. దీంతో కోహ్లీ కేవలం టెస్ట్ కెప్టెన్‌గా మాత్రమే మిగిలిపోయాడు. RCB కెప్టెన్సీని వదిలిపెడుతూ.. ఐపీఎల్ ఆడినంత కాలం RCBలోనే కొనసాగుతానని కోహ్లీ ప్రకటించాడు. అన్నట్లుగానే రూ.2 కోట్లు తక్కువ ఇచ్చినా ఆర్‌సీబీ రిటెన్షన్‌కు ఒప్పుకొనున్నాడు. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు జరిగిన రిటెన్షన్ ప్రక్రియలో ఆర్‌సీబీ ముగ్గురు ఆటగాళ్లను అంటిపెట్టుకుంది. విరాట్ కోహ్లీని ఫస్ట్ స్లాబ్ ప్లేయర్‌గా రూ.15 కోట్లకు, గ్లేన్ మ్యాక్స్‌వెల్‌కు రూ.12 కోట్లు, మహమ్మద్ సిరాజ్‌కు రూ.7 కోట్లకు తీసుకుంది.
VIRAT KOHLI BATTING STATS AS CAPTAIN IN THE IPL
124 : INNINGS
4476 : RUNS
43.88 AVERAGE
134.73
5 : 100S
32 : FIFTY
370 : FOURS
158 : SIXES
KING KOHLI👑 #ViratKohli #IndiaVsNewZealand #IndianCricketTeam #KingKohli pic.twitter.com/wAhMQ2xq5j— KING OF CRICKET VIRAT.KOHLI (@FanarmyVirat) December 7, 2021
విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వదులుకోవడంతో ఆర్‌సీబీ ఫ్రాంచైజీ కొత్త కెప్టెన్‌ను ఎంచుకునే ప్రయత్నంలో ఉంది. కర్ణాటకకే చెందిన స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లపై ఆ ఫ్రాంచైజీ కన్నేసింది. అయితే భారత క్రికెట్‌లో చోటు చేసుకున్న తాజా పరిణామాల నేపథ్యంలో మళ్లీ విరాట్ కోహ్లీనే తమ కెప్టెన్‌గా నియమించకునేందుకు ఆ ఫ్రాంచైజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ కూడా మళ్లీ ఆర్‌సీబీ సారథ్య బాధ్యతలు అందుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి కోహ్లీ మళ్లీ RCB కెప్టెన్ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.