రన్ మెషీన్, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే 71 సెంచరీలు చేశాడు. సచిన్ 100 సెంచరీల రికార్డును బ్రేక్ చేయగల సామర్థ్యం ఉన్న క్రికెటర్. అలాంటి ఆటగాడు సెంచరీ చేసి దాదాపు మూడేళ్లు అవుతుంది. కోహ్లీ కెరీర్‌లో సెంచరీ లేకుండా ఇంత కాలం ఎప్పుడూ లేడు. ప్రస్తుతం భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం ఖాయం. కాకపోతే అవి పరుగుల కావు.. మ్యాచ్‌ల సంఖ్యతో సెంచరీ మార్క్ దాటనున్నాడు.
బుధవారం భారత్-వెస్టిండీస్ మధ్య జరిగే రెండో వన్డేతో స్వదేశంలో విరాట్ కోహ్లీ 100 వన్డేలు ఆడిన రికార్డును సొంతం చేసుకోనున్నాడు. చాలా కాలంగా కోహ్లీ సెంచరీపై చర్చ జరుగుతుండడంతో ఈ వంద వన్డేల రికార్డు విశేషంగా మారింది. సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ సెంచరీ విషయమై ఆయన ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎందురుచూస్తున్నారు. అందుకే ఈ రికార్డును కూడా బాగానే సెలబ్రెట్ చేసుకుంటున్నారు. రెండో వన్డేలో కోహ్లీ చేయకున్న.. సెంచరీనే అంటూ సోషల్‌మీడియాలో కోహ్లీకి మద్దతు తెలుపుతున్నారు.
కాగా ఇప్పటి వరకు స్వదేశంలో వంద వన్డేలు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల లిస్ట్ చూస్తే.. భారత దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్(164), ఎంఎస్ ధోని(127), అజహారుద్దీన్(113), యువరాజ్ సింగ్(108) ముందున్నారు. వీరి తర్వాత కోహ్లీ ఈ రికార్డును సాధించనున్నాడు. ఇక కోహ్లీ స్వదేశంలో ఆడిన 99 మ్యాచ్‌ల్లో 60 సగటుతో 5002 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరి కోహ్లీ 100వ వన్డేపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.