ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ తన 75వ అంతర్జాతీయ శతకం బాదాడు. ఇక ఈ సెంచరీని చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు కోహ్లీ ఫ్యాన్స్. ఇక తాజాగా ఓ రాష్ట్రానికి చెందిన విరాట్ ఫ్యాన్స్ చేసిన పనికి నెటిజన్లు హేట్సాఫ్ అంటున్నారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసిస్ తో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భారీ శతకం బాదాడు. దాంతో భారత్ భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు విరాట్ కోహ్లీ. ఇక కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో అభిమానులు ఉంటారన్న సంగతి మనకు తెలిసిందే. కోహ్లీ ఏదైనా స్పెషల్ ఇన్నింగ్స్ ఆడితే.. దానిని స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటారు కోహ్లీ ఫ్యాన్స్. తాజాగా ఆసిస్ పై బాదిన తన అంతర్జాతీయ 75వ సెంచరీని కూడా ఇంతే స్పెషల్ గా సెలబ్రేట్ చేసి కోహ్లీ ఫ్యాన్స్ అనిపించుకున్నారు. ఇంతకు ఆ ఫ్యాన్స్ చేసిన పనేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
విరాట్ కోహ్లీ.. చాలా కాలం తర్వాత టెస్టుల్లో సెంచరీ బాది ఫ్యాన్స్ కు మంచి గిఫ్ట్ ఇచ్చాడు. ఆసిస్ తో జరిగిన ఈ మ్యాచ్ లో 186 పరుగుల భారీ శతకాన్ని నమోదు చేసి తన సెంచరీ దాహం తీర్చుకున్నాడు. ఇది విరాట్ కు టెస్టుల్లో 28వ సెంచరీకాగా ఓవర్ ఆల్ గా అంతర్జాతీయ కెరీర్ లో 75వ శతకం కావడం విశేషం. దాంతో ఈ సెంచరీని స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు దేశవ్యాప్తంగా ఉన్నకోహ్లీ ఫ్యాన్స్. ఇక పశ్చిమ బెంగాల్ కు చెందిన విరాట్ కోహ్లీ హెల్ప్ ఫౌండేషన్ వారు రోడ్డు సైడ్ ఉండే వారికి అన్నదానం చేసి తమ అభిమానాన్ని, గొప్ప మనసును చాటుకున్నారు.
ఈ ఫౌండేషన్ ద్వారా రోడ్ పక్కన ఆకలితో బాధపడుతున్న వారికి ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చి.. కోహ్లీ 75 వ సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నారు. దాంతో కోహ్లీ ఫ్యాన్స్ పై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ఫోటోలు చూసిన కొంతమంది అభిమానులు విరాట్ ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉంటది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో రోహిత్ అభిమానులు సైతం ఇలాగే రోహిత్ సెంచరీ చేస్తే.. ఫుడ్ ప్యాకెట్స్ ను పంపిణి చేశారు. ఇప్పుడు విరాట్ ఫ్యాన్స్ తమ గొప్ప మనసును చాటుకున్నారు. మరి కోహ్లీ ఫ్యాన్స్ చేసిన గొప్ప పనిపై, గొప్ప మనసుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Virat Kohli fans from West Bengal donated food packets on the occasion of Kohli’s 28th Test century. pic.twitter.com/BlhZX3dGq4
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 13, 2023