ప్రస్తుతం టీమిండియా వరుస సిరీస్ లతో బిజీ బిజీగా ఉంది. దాంతో ఆటగాళ్లు తమ పర్సనల్ లైఫ్ కు సమయం కేటాయించలేక పోతున్నారు. ఎవరనుకోరు చెప్పండి కాస్త టైమ్ దొరికితే తమ సతీమణితో సరదాగా కబుర్లు చెప్పుకొవాలని. కానీ వారు మాత్రం ఏం చేస్తారు.. దేశం కోసం ఆడేటప్పుడు కొన్ని కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. అయినప్పటికీ కాస్త సమయం చిక్కితే భార్యతో కలిసి గడుపుతూంటారు. ఈ మధ్యనే ఆసియా కప్ తర్వాత రోహిత్, కోహ్లీలు తమ సతీమణులతో కలిసి తిరిగిన ఫొటోలు వైరల్ గా మారిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే అనుష్కతో కోహ్లీ వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈవార్తకు సంబంధించి మరిన్నివివరాల్లోకి వెళితే..
విరాట్ కోహ్లీ-అనుష్కశర్మ.. అటు బాలీవుడ్ లో.. ఇటు క్రికెట్ లో మోస్ట్ పాపులర్ జంట. ఈ జంట ఎక్కడైనా కనిపిస్తే చాలు ఆ వార్త క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక వారు తమ తమ వృత్తి రీత్యా బిజీ.. బిజీగా గడుపుతూ.. ఉంటారు. వరుస సిరీస్ లతో కింగ్ కోహ్లీ తీరికలేకుండా మ్యాచ్ లు ఆడుతుంటే! అనుష్క సైతం షూటింగ్ లతో బిజీగా ఉంటోంది. వీరిద్దరు కొన్నిరోజుల కిందట లండన్ వీధుల్లో కాఫీ షాప్ లో సరదాగా దిగిన ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే టీమిండియా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ లో భాగంగా తన తొలి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ అనంతంరం బస్సులో టీమిండియా ఆటగాళ్లు అందరు బయలుదేరారు. ఇక్కడే ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. బస్సు చుట్టు చేరిన అభిమానులకు కోహ్లీ సర్ ప్రైజ్ ఇచ్చాడు.
ఈ క్రమంలోనే అభిమానులందరు విజయంతో తెగ ఉత్సాహంగా అరుస్తుండగా.. అనుష్క శర్మతో వీడియో కాల్ మాట్లాడుతున్న కోహ్లీ.. అభిమానుల వైపు తన ఫొన్ తిప్పి అనుష్క శర్మకు ఆ క్రౌడ్ ను చూపించాడు. కాల్ లో అభిమానులను చూసిన అనుష్క నవ్వులు చిందించింది. దాంతో అభిమానులు ఇంకా గట్టింగా అరుస్తూ.. తమ ప్రేమను తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆటగాళ్లు విరామం లేకుండా టోర్నీలు ఆడుతుండటంతో.. వారికి కుటుంబానికి తగినంత సమయం కేటాయించలేక పోతున్నారు. ఇలాంటి సందర్భాల్లోనే వారు వీడియో కాల్ ద్వారా తమ సతీమణులతో ఇలా మాట్లాడటం జరుగుతోంది. ఇక ఇదే బస్సులో ముందు కూర్చున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానుల అరుపులు చూడగానే.. అతడు కూడా తన ఆనందాన్ని ఆపుకోలేక గట్టిగా అరిచాడు. ఇక తొలి మ్యాచ్ విజయంతో జోరు మీదున్న భారత్.. తన తర్వాతి మ్యాచ్ లో కూడా తన జోరును కొనసాగించాలని భావిస్తోంది.
Virat Kohli in video call with Anushka while returning from match and shows it to fans 😂❤️ pic.twitter.com/OrlHnV5I6A
— User Hyped up for PS1 (@KohlifiedGal) September 29, 2022