టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు పెడితే కొన్ని కోట్లు అతని బ్యాంకు ఖాతాలో పడుతాయి. ఒక యాడ్స్ ద్వారా, బీసీసీఐ కాంట్రాక్ట్, ఐపీఎల్ ద్వారా కూడా భారీగానే ముడుతుంది. ఇంతటి భారీ సంపాదన ఉన్న ఇండియాస్ మోస్ట్ ఫేమస్ క్రికెటర్ కోహ్లీ వాడే ఫోన్ కూడా అంతే కాస్టీదై ఉంటుంది. సహజంగా ఎవరైన ఇదే అనుకుంటారు.
ప్రపంచలోనే అత్యంత ఖరీదైన ఫోన్‌ను కోహ్లీ వాడుతున్నాడని దాన్ని చూడని వారు కూడా చెప్పొచ్చు. ఎందుకంటే కోహ్లీ లీవింగ్ స్టైల్ అలాంటింది. కానీ విరాట్ కోహ్లీ కేవలం రూ.25 వేల కంటే తక్కువ ధర ఉన్న స్మార్ట్ ఫోన్ వాడుతున్నాడని సమాచారం. కొంతమంది ఇదే నిజమంటూ ఒక ఆధారం కూడా చూపిస్తున్నారు. శనివారం కోహ్లీ నేలపై పడుకున్న ఒక ఫొటోను షేర్ చేశాడు. ఆ ఫొటో వీవో కంపెనీకి చెందిన ఫోన్.. వీవో వీ23ఈ 5జీ మోడల్‌తో తీసినట్లు తెలుస్తుంది. ఫొటో కింద ఆ మోడల్ పేరుంది.
దీంతో కోహ్లీ ఈ ఫొనే వాడుతున్నాడంటూ.. అతని సింప్లీసిటీపై కోహ్లీ ఫ్యాన్స్ అబ్బురపడుతున్నారు. కానీ.. కోహ్లీ ఖరీదైన ఫోన్ వాడుతుంటాడు.. అది వేరే వాళ్ల ఫోన్ అయిఉంటుందని కూడా కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తున్నారు. అలాగే వీవో కంపెనీ ఫోన్ వాడే వాళ్లు.. కోహ్లీ కూడా సేమ్ మేము వాడే కంపెనీ ఫోన్నే వాడుతున్నాడని ఆనందపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కోహ్లి ఓపెనర్‌గా పనికిరాడు.. ఆస్ధానంలోనే బ్యాటింగ్‌కు రావాలి
The Earth has music for those who listen. pic.twitter.com/dyeMuwTff6
— Virat Kohli (@imVkohli) March 19, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.