ఒడిస్సా రైల్ ప్రమాదం.. ప్రగాఢ సానుభూతి తెలియజేసిన విరాట్ కోహ్లీ

ఒడిశాలో కోరామండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాద ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

ఒడిశాలో కోరామండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాద ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రెండు సూపర్ ఫాస్ట్ రైళ్ళు ఒక గూడ్స్ ఢీ కొనడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. దాదాపు 10 ఏళ్లలో ఇదే అతి పెద్ద ప్రమాదమని తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఇప్పటికీ 238 మంది పైగా మరణించగా, 900 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షత గాత్రులని స్థానిక హాస్పిటల్స్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి స్పందించి ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు. తాజాగా టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ విషయంపై తన సానుభూతిని తెలియజేశాడు.

ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో సంభవిస్తుందో చెప్పలేం. ఒడిశాలో అనూహ్యంగా జరిగిన ఒక భారీ ప్రమాదం వలన చాలా మంది కుటుంబాలకు కన్నీరుని మిగిల్చింది. ప్రస్తుతం దేశంలో ఉన్న అందరిని ఈ భారీ ప్రమాదం గురించి ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం సిద్ధమవుతున్న కోహ్లీ.. ఈ ప్రమాదంపై చలించిపోయాడు “ఒడిశాలో సడన్ గా ఇలా ట్రైన్ ఆక్సిడెంట్ చోటు చేసుకోవడం షాక్ కి గురి చేసింది. ప్రమాదంలో ఇంతమంది చనిపోవడం నా మనసుని కలిచి వేస్తుంది. వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. వారి కుంటుంబాలు నా ప్రగాఢ సానుభూతి”. అని కోహ్లీ ట్విట్టర్ లో ట్వీట్ చేసాడు.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed