టీమిండియా చాలా గడ్డు పరిస్థితులు ఫేస్ చేస్తోంది. ఫార్మాట్ తో సంబంధం లేకుండా తడబడుతూనే ఉంది. కోహ్లీ కెప్టెన్ గా టైంలో చాలా విమర్శలు చేశారు. ఎంతో అవమానించారు! దీంతో అతడి గేమ్ తడబడింది. ఆట పరంగా పూర్తిగా సైడ్ ట్రాక్ అయిపోయాడు. ఏదైతేనేం కోహ్లీని కెప్టెన్ గా తప్పించారు. దీంతో ప్రాబ్లమ్ తొలగిపోతుందని అనుకున్నారు. కానీ ముందు కంటే ఎక్కువైనట్లు కనిపిస్తుంది. కెప్టెన్లు మారుతున్నా సరే టీమిండియా దురదృష్టం మాత్రం మారడం లేదు. అయితే కెప్టెన్ గా ఉన్నప్పుడు కోహ్లీ అమలు చేసిన ప్లాన్స్.. ఇప్పుడు ఇతర దేశాల కెప్టెన్లకు పనికొస్తున్నాయి. ఈ విషయం ఇప్పుడు క్రికెట్ ప్రేమికుల మధ్య హాట్ టాపిక్ గా మారడం విశేషం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీమిండియాకు దొరికిన అద్భుతమైన క్రికెటర్లలో విరాట్ కోహ్లీ కచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే ఓ బ్యాటర్ గా ఎంతివ్వాలో అంతా ఇచ్చాడు. ఫార్మాట్ ఏదైనా సరే తన మార్క్ చూపించాడు. ధోనీ కెప్టెన్సీలో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. అయితే మహీ రిటైర్మెంట్ తర్వాత.. విరాట్ సారథ్యం అందుకున్నాడు. ట్రోఫీలు గెలవలేదు అనే ఒక్కమాట తప్పించి, జట్టులో ఆటగాళ్లకు దూకుడు అలవాటు చేశాడు. ఫిట్ నెస్ విషయంలోనూ ఆటగాళ్ల ఆలోచనను పూర్తిగా మార్చి పడేశాడు. ఒకప్పుడు అసలు బాడీ విషయంలో శ్రద్ధ ఉండేది కాదు. కోహ్లీ వచ్చిన తర్వాత ఆటగాళ్లు చాలామంది సిక్స్ ప్యాక్ లు మెంటైన్ చేస్తూ, ఆరోగ్యాన్ని హెల్తీగా ఉంచుకుంటున్నారు.
వన్డేలు, టీ20ల్లో కెప్టెన్ గా కోహ్లీ సక్సెస్ అయ్యాడు. టెస్టుల్లో మాత్రం ప్రపంచానికే సరికొత్త దారిచూపాడు. ఎందుకంటే టెస్టు మ్యాచులో ఏ కెప్టెన్ కూడా డేర్ చేయడానికి ఇష్టపడరు. మ్యాచ్ గెలిచే పరిస్థితి ఉంటే ఓకే గానీ.. లేదంటే చాలా వరకు డ్రా చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కోహ్లీ మాత్రం ఇలా చేయలేదు. ఏదైతే అది అయింది, టైం లేదు వికెట్లు లేవు అన్నా సరే గెలవడానికే ట్రై చేద్దాం అనే సరికొత్త పంథాను పరిచయం చేశాడు. అలా చాలా మ్యాచుల్లో మన జట్టు విజయం సాధించింది కూడా. కెప్టెన్ గా టెస్టుల్లో కోహ్లీ, ఏ కెప్టెన్ సాధ్యం కాని సరికొత్త రికార్డ్స్ ని కూడా సెట్ చేసి పెట్టడం మరో విశేషం.
ఇకపోతే టెస్టు కెప్టెన్ గా మొత్తం 68 మ్యాచులాడిన కోహ్లీ.. 40 మ్యాచుల్లో విజయం సాధించాడు. స్వదేశంలో అయితే 24 సిరీసులు ఆడగా.. 18లో విజయం సాధించింది. ఒక్కటంటే ఒక్కటి కూడా ఓడిపోలేదు. ఆసీస్ ని వాళ్ల దేశంలోనే ఓడించాడు. టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కు కూడా భారత జట్టుని తీసుకెళ్లడంలో కోహ్లీ రోల్ అస్సలు మర్చిపోలేం. ఇక టెస్టులో కోహ్లీ డబుల్ సెంచరీలు రికార్డు గురించి ఎంత చెప్పుకున్నా సరే తక్కువే. అలాంటి కోహ్లీని టీమిండియా మేనేజ్ మెంట్ చాలా ఇబ్బందులు పెట్టింది. అవమానించింది కూడా. కానీ కోహ్లీ పెద్దగా ఏం అనలేదు. టెస్టులో కోహ్లీ టెక్నిక్స్ ఇప్పుడు ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ కు బాగా పనికొస్తున్నాయి. దాన్నే పాక్ తో తొలి టెస్టులో ఉపయోగించి విజయం సాధించాడు. నాలుగు సెషన్స్ ముందే ఇంగ్లాండ్ డిక్లేర్ ఇచ్చినప్పటికీ.. పాక్ జట్టుకు సవాలు విసిరింది. గెలిచి చూపించింది. దీన్ని చూసిన పలువురు నెటిజన్స్.. మనం అవమానించిన కోహ్లీని ఇంగ్లాండ్ ఆదర్శంగా తీసుకుందని గుర్తుచేస్తున్నారు. ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ కూడా విరాట్ టెక్నిక్ నే ఫాలో అవుతున్నాడని అంటున్నారు.
In 2021 – India under Virat Kohli declared innings and bowled out ENG at The Oval within 60 overs on day 5 & win test match.
In 2022 – England under Ben Stokes declared & bowled out PAK in Rawalpindi on day 5 &win test match.
Two one of the greatest test matches in the history! pic.twitter.com/XfFXrmVhgD
— CricketMAN2 (@ImTanujSingh) December 5, 2022
Petition to get Virat Kohli back as test captain Few historic wins still left for Kohli the test captain pic.twitter.com/bpFCEYk6Od
— leishaa ✨ (@katyxkohli17) December 5, 2022
India under Virat Kohli in home Tests:
👉 31 matches
👉 24 wins 💥
👉 2 losses
👉 5 draws
👉 12.0 W/L record
👉 0 Series LossWon by less than 100 runs: 1
Won by 100-199 runs: 4
Won by 200 or more runs: 7
Won by innings: 9
Won by more than 8 wickets left: 3Total Domination pic.twitter.com/pbSj8P4H8P
— Cricket🏏 Lover (@CricCrazyV) December 5, 2022
Virat Kohli & Ben Stokes pic.twitter.com/p7oNIq5hKq
— RVCJ Media (@RVCJ_FB) December 6, 2022