టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులో తనకు విలువ లేదని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కోహ్లీ తన బాధను చెప్పుకున్నాడా? లేక రోహిత్ శర్మను టార్గెట్ చేశాడా? అనే విషయంపై క్రికెట్ అభిమానులు తెగ మదనపడిపోతున్నారు.
‘కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత జట్టులో ఒక సాధారణ ఆటగాడిగా సర్దుకునేందుకు చాలా ఇబ్బంది పడ్డాను. కెప్టెన్సీ చేసిన అలవాటులో ఏదైనా చెప్పాలని అనుకున్నా.. నేను కెప్టెన్ కాదు అని నాకు నేను చెప్పుకుని కామ్‌గా ఉండిపోయేవాడిని, అయినా మన అభిప్రాయానికి విలువ లేని చోట ఏది చెప్పినా అది అవివేకం అవుతుంది. కానీ, ఆర్సీబీ విషయంలో నాకు ఈ ఇబ్బంది లేదు. డుప్లెసిస్‌కు నేను ఏది చెప్పిన వింటాడు. నా మాటకు గౌరవం ఇస్తాడు.’ ఈ మాటలు టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుతం జట్టులో సీనియర్ స్టార్ ప్లేయర్‌గా ఉన్న విరాట్ కోహ్లీ అన్నవి. వినేందుకు చాలా సాధారణంగానే ఉన్నా.. వాటి లోతుల్లో చాలా అర్థాలే దాగున్నాయి. ప్రస్తుతం టీమిండియాలో మాజీ కెప్టెన్ ఉన్న కోహ్లీ మాటకు ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ఏ మాత్రం విలువ ఇవ్వడం లేదని కోహ్లీ చెప్పిన దాంతో స్పష్టం అవుతుంది.
అయితే నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా? అంటే ఆ విషయం కోహ్లీ-రోహిత్ ఇద్దరికే తెలియాలి. అయితే.. కెప్టెన్సీ వదులుకున్న తర్వాత విరాట్ కోహ్లీ ఫామ్ చాలా దారుణంగా దెబ్బతింది. ఏ ఫార్మాట్లలో కూడా కోహ్లీ తన స్థాయికి తగ్గట్లు బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఇలాంటి సమయంలో కోహ్లీని జట్టు నుంచి తప్పించాలని, యువ క్రికెటర్లకు అవకాశం కల్పించాలని కూడా డిమాండ్ వ్యక్తం అయింది. ఒకానొక దశలో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ మీడియా సమావేశంలో పాల్గొన్న సమయంలో.. కోహ్లీ ఫామ్‌పై, జట్టు నుంచి తప్పించే విషయమై, అలాగే కోహ్లీకి కాన్ఫిడెన్స్ తగ్గిందని భావిస్తున్నారా? అంటూ ఎదురైన కఠిన ప్రశ్నలకు రోహిత్ ఒక్క నవ్వుతో సమాధానమిచ్చి, కోహ్లీ లాంటి గొప్ప ఆటగాడికి కాన్ఫిడెన్స్ అవసరం ఉందంటారా? అంటూ కోహ్లీకి మద్దతుగా నిలాచడు. కోహ్లీ లాంటి ఆటగాడి అవసరం టీమిండియాకు ఎంతో ఉందని నమ్మిన వారిలో రోహిత్ శర్మ కూడా ఒకడు.
కెప్టెన్‌గా జట్టులో సీనియర్ ప్లేయర్ అయిన కోహ్లీకి కావాల్సినంత ఫ్రీడమ్ ఇస్తూ.. అతను ఫామ్ అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు రోహిత్ శర్మ. ఆసియా కప్ 2022లో కోహ్లీ ఆఫ్ఘనిస్థాన్‌పై సెంచరీతో చెలరేగి, తిరిగి ఫామ్ అందుకున్న సమయంలోనూ స్వయంగా రోహిత్ శర్మనే కోహ్లీని ఇంటర్వ్యూ చేశాడు. టీ20 వరల్డ్ కప్ 2022లో పాకిస్థాన్‌పై కోహ్లీ 82 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను గెలిపించిన తర్వాత.. గ్రౌండ్‌లోకి పరిగెత్తుకుంటూ వచ్చిన రోహిత్.. కోహ్లీని అమాంతం ఎత్తుకున్నాడు. ఇలా పలు సందర్భాలతో కోహ్లీ-రోహిత్ మధ్య విభేదాలు లేవని అభిమానులు మెల్లమెల్లగా నమ్మడం ఆరంభించారు. కానీ.. ఎప్పుడు తన కెప్టెన్సీ ప్రస్తావన వచ్చినా ధోని గురించి మాట్లాడే కోహ్లీ, బ్యాడ్ టైమ్స్‌లో తనకు మద్దతుగా నిలిచి, తనపై నమ్మకం ఉంచిన రోహిత్ శర్మ గురించి ఒక్క మాట మాట్లాడిన దాఖలా లేదు.
ఇటివల టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ స్టింగ్ ఆపరేషన్‌లోనూ.. రోహిత్ శర్మ-కోహ్లీ మధ్య విభేదాలు ఉన్నా, రోహిత్ శర్మ మాత్రం కోహ్లీని టీమ్‌లో ఉంచేందుకు గట్టిగా నిలబడ్డాడని, కోహ్లీ బ్యాడ్ ఫేజ్‌లో రోహిత్ మద్దతుగా నిలబడ్డాడని చేతన్ శర్మ వెల్లడించాడు. అయినా కూడా ఏనాడు కోహ్లీ, రోహిత్ శర్మ గురించి పాజిటివ్‌గా మాట్లాడలేదు. కానీ.. ఇప్పుడు మాత్రం ఆర్సీబీలో డుప్టెసిస్‌తో ఉన్నంత చనువు, ఆర్సీబీలో తనకు దక్కుతున్న గౌరవం టీమిండియాలో లేదనే అర్థం వచ్చేలా.. రోహిత్ శర్మను టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్ కప్‌కు ముందు విరాట్ కోహ్లీ ఇలా టీమ్‌లో కల్లోలం సృష్టించే వ్యాఖ్యలు చేయడం కచ్చితంగా జట్టుకు నష్టం చేస్తుంది. అయినా.. విభేదాలను పక్కనపెట్టి రోహిత్ తనకు మద్దతుగా నిలబడితే.. కోహ్లీ ఇలా టార్గెట్ చేస్తూ మాట్లాడటంపై క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జట్టులో ఏదో జరుగుతుందనే భావనను క్రియేట్ చేసేలా కోహ్లీ వ్యాఖ్యలు ఉన్నాయని, టీమ్ వరల్డ్ కప్‌కు సిద్ధమవుతున్న తరుణంలో కోహ్లీ కామెంట్ జట్టులో అలజడి రేపుతుందని అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat Kohli (in RCB Podcast) said “MS Dhoni was the only person who genuinely reached out to me during my lean patch in 2022, for me it’s a blessing to have a pure bond with Dhoni”.
— Johns. (@CricCrazyJohns) February 25, 2023
Virat Kohli opens up about his camaraderie with MS Dhoni, on @eatsurenow presents #RCBPodcast
ICYMI, Watch the full episode on RCB Youtube Channel and listen to the audio versions of all the 10 episodes of the podcast on Spotify and Apple Podcasts#PlayBold @danishsait pic.twitter.com/CBE9X3y1Wg
— Royal Challengers Bangalore (@RCBTweets) February 26, 2023