క్రీడా ప్రపంచలో ఆటగాళ్లకు ముఖ్యంగా ఉండాల్సింది ఫిట్ నెస్. దాని కోసం వారు రకరకాల కసరత్తులు చేస్తుంటారు. అయితే కసరత్తులు చేసినంత మాత్రాన ఫిట్ నెస్ రాదు. దానికి తగ్గట్టుగానే ఆహారం కూడా తీసుకోవాలి. అప్పుడే బాడీ ఫిట్ నెస్ లోకి వస్తుంది. ఇక టీమిండియాలో ఫిట్ నెస్ కు పెట్టింది పేరు విరాట్ కోహ్లీ. విరాట్ ఫిట్ నెస్ కు ఎంత ప్రాముఖ్యం ఇస్తాడో అతడి బాడీని చూస్తేనే తెలుస్తుంది. అయితే ఇంతటి ఫిట్ నెస్ సాధించడానికి పక్కాగా కోహ్లీ డైట్ పాటిస్తాడని అందరు అనుకుంటారు. కానీ నేనూ భోజనప్రియుడినే అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. తాను తిన్న ఆ ఫ్రైడ్ రైస్ ను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పుకొచ్చాడు.
ఫిట్ నెస్ అనే రాజ్యానికి విరాట్ కోహ్లి కింగ్. అతడు అనుకున్న శరీర ఆకృతి కోసం కఠినమైన డైట్ తో పాటుగా రకరకాల కసరత్తులు చేస్తుంటాడు.. అందులో ఎక్కడా రాజీపడడు. అందుకే మైదానంలో చిరుతలా పరిగెడుతుంటాడు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విరాట్ తన చిన్ననాటి విషయాలను పంచుకున్నాడు. ఇప్పుడు ఆహార నియమాలు ఉన్నాయి గానీ చిన్నతనంలో రోడ్డు పక్కన బండ్లపై అమ్మె చిరుతిళ్లను ఇష్టంగా తినేవాడిని అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా తన జీవితంలో మర్చిపోలేని వంటకం గురించి తెలిపాడు.
“ఒక సారి చైనీస్ రెస్టారెంట్ కు వెళ్లాం. అక్కడ ఉన్న వాన్ పేరు ‘చుక్ చుక్ మెయిల్’. ఇక వారు చేసిచ్చిన మాంచో సూప్, ఫ్రైడ్ రైస్ ఎంతో అద్భుతం. ఈ ఫ్రైడ్ రైస్ ను నేను ఎప్పటికీ మర్చిపోలేను. అదీకాక ఈ వంటకం టేస్ట్ మరెక్కడా దొరక్కపోవచ్చు” అని కోహ్లీ పేర్కొన్నాడు. ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నాను తన సొంత రెస్టారెంట్ ‘వన్8 కమ్యూన్’ కు విరాట్ ఆహ్వానించాడు. ఈ సందర్భంగా కాసేపు ఇద్దరు సరదా సరదాగా మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను విరాట్ తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు.
Virat Kohli talked about his favourite Chinese food while speaking to Michelin star chef Vikas Khanna.#CricketTwitterhttps://t.co/QiRKfWFdnp
— CricTracker (@Cricketracker) December 14, 2022