టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో దారుణంగా విఫలం అయ్యాడు. దీంతో కోహ్లీ పని అయిపోయిందని విమర్శలు మొదలయ్యాయి. టీమిండియాను ఎన్నో మ్యాచ్‌లలో ఒంటిచేత్తో గెలిపించిన కోహ్లీ ప్రస్తుతం పూర్ ఫామ్‌తో జట్టుకు భారంగా మారాడనే విమర్శలు వస్తున్నాయి.
ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో కోహ్లీ చేసిన పరుగులను ఒకసారి పరిశీలిస్తే.. తొలి వన్డేలో 8 పరుగులు, రెండో వన్డేలో 18 పరుగులు, మూడో వన్డేలో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ పరుగులను బట్టి చూస్తే ఈ సిరీస్‌లో కోహ్లీ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. దీంతో పాటు జట్టులో చోటు కోసం ఎంతో మంది టాలెండెట్ యంగ్ క్రికెటర్లు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ పూర్ ఫామ్ విమర్శకులకు ఆయుధంగా మారింది.
దీంతో పాటు వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించడంతో ఇప్పుడు జట్టులో అతనో సాధారణ బ్యాట్స్‌మెన్ మాత్రమే.. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతూ జట్టుకు భారంగా మారాడు అనడంలో సందేహం లేదు. కానీ కోహ్లీ గత రికార్డులను, అతని నైపుణ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాబోయే వన్డే వరల్డ్ కప్ వరకు కోహ్లీకి జట్టులో చోటుపై ఎలాంటి ఢోకా ఉండదనేది క్రికెట్ నిపుణుల మాట. మరి కోహ్లీ ఫామ్ లేమిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.