ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 35 పరుగులతో టచ్‌లోకి వచ్చిన కోహ్లీ.. ఆ తర్వాత హాంకాంగ్‌పై హాఫ్ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చాడు. ఇక సూపర్ ఫోర్‌లో ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే 44 బంతుల్లో 60 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇంగ్లండ్ టూర్ తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్న కోహ్లీ.. ఆసియా కప్‌తోనే తిరిగి జట్టులోకి వచ్చాడు. సూపర్ ఫోర్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడినా.. కోహ్లీ ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురిసింది. కాగా.. ఆ మ్యాచ్ తర్వాత మీడియాతో మాట్లాడిన కోహ్లీ.. సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ధోనితో అనుబంధం గురించి ప్రస్తావిస్తూ.. తాను టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న టైమ్‌లో ధోని ఒక్కడే తనకు మెసేజ్ చేశాడని, చాలా మంది దగ్గర తన నంబర్ ఉన్నా.. ధోని ఒక్కడే మెసేజ్ చేసినట్లు కోహ్లీ తెలిపాడు. నాతో ధోనికి ఏం వచ్చేది లేదు పోయేది లేదు, అలాగే నాకు అతనితో ఏం వచ్చేది లేదు పోయేది. అయినా కూడా ధోని మెసేజ్‌చేశాడు. అది నిజమైన బంధంగా నాకు అనిపించింది. చాలా మంది టీవీల్లో సలహాలు ఇచ్చినవాళ్లు సైతం నాకు ఎలాంటి మెసేజ్ చేయలేదని కోహ్లీ అన్నాడు. దీంతో కోహ్లీ ఆ సమయంలో చాలా ఆవేదనకు గురైనట్లు తెలిసింది. కానీ.. ఈ విషయంపై బీసీసీఐ అధికారి ఒకాయన స్పందిస్తూ.. కోహ్లీ వ్యాఖ్యలను ఖండించారు. విరాట్ చెప్పిందంతా అబద్ధమని అన్నారు. కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సమయంలో అంతా అతనికి అండగా ఉన్నామని.. సోషల్ మీడియా వేదికగా అందరూ తమ మద్దతు, శుభాకాంక్షలు తెలిపారంటూ ఆయన వెల్లడించారు.
కాగా.. బ్యాటింగ్‌పై మరింత శ్రద్ధ పెట్టేందుకు విరాట్ కోహ్లీ తొలుత టీ20 కెప్టెన్సీ వదులుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వైట్ బాట్ క్రికెట్‌కు ఒకే కెప్టెన్ ఉండాలనే కాన్సెప్ట్‌తో బీసీసీఐ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తొలగించి ఆ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించింది. టెస్టులకు మాత్రం కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగుతాడని బీసీసీఐ ప్రకటించింది. కానీ.. కొన్ని రోజులకే కోహ్లీ టెస్టు కెప్టెన్సీ సైతం వదులుకుని అందరికి షాకిచ్చాడు. ఆ తర్వాత కొంత కాలం ఫామ్‌లేమితో ఇబ్బంది పడిన కోహ్లీ.. ఆసియా కప్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. హైప్రెషర్ మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడి తన సత్తా ఏంటో మరోసారి చాటాడు. మరి కోహ్లీ వ్యాఖ్యలపై బీసీసీఐ అధికారి ఖండనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: బౌలర్ అర్షదీప్ వ్యవహారంపై కేంద్రం సీరియస్… సమన్లు జారీ
The bond between MS Dhoni & Virat Kohli is pure gold. pic.twitter.com/g6pbSRkwp0
— Johns. (@CricCrazyJohns) September 4, 2022
32 T20I fifties for Virat Kohli 👏
Read More 👉 https://t.co/aAlFic3Vvy pic.twitter.com/ZWfDyLMSN9
— ICC (@ICC) September 5, 2022
Virat Kohli via press conference:
“I always have a special bond with MS Dhoni” 😍pic.twitter.com/AtQEOj7IwP
— CricTracker (@Cricketracker) September 4, 2022