కోహ్లీ స్టామినా ఏంటో బయటపడిన క్షణం.. అతను ఎలాంటి విధ్వంసం సృష్టించగలడో చాలా చెప్పిన మ్యాచ్.. క్రికెట్ పట్ల అతని ఉన్న అంకితం ఎలాంటిదో తెలిసొచ్చిన సీజన్.. కేవలం 15 ఓవర్ల మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కిన కోహ్లీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
విరాట్ కోహ్లీ ఇండియన్ క్రికెట్‌లో సచిన్ తర్వాత సచిన్ అంతటి వాడు. ఇప్పటికే సెంచరీల విషయంలో సచిన్ తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. 2023 వన్డే వరల్డ్ కప్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అంతకంటే ముందు.. ఐపీఎల్‌లో ఆర్సీబీకి కప్పు అందించడం ప్రస్తుతం కోహ్లీ ముందున్న టార్గెట్. దీని కోసం కోహ్లీ పూర్తి స్థాయిలో సంసిద్ధం అవుతున్నాడు. మరి కొన్ని రోజుల్లో ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉండటంతో ఆర్సీబీ సైతం కప్పుపై ఆశలు పెట్టుకుంది. అలాగే.. విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో 15 వసంతాలు పూర్తి చేసుకోవడంతో ప్రముఖ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ స్టార్ స్పోర్ట్స్ కోహ్లీ జర్నీపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.
ఈ 15 ఏళ్ల ప్రయాణంలో కోహ్లీతో కసిలి నడిన వారిని స్టార్ స్పోర్ట్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలో సంజయ్ బాంగర్‌ను సైతం స్టార్ స్పోర్ట్స్ పలకరించింది. ఈ చిట్‌చాట్‌లో బాంగర్ ఆసక్తికరమైన విషయాలను రీకాల్ చేసుకున్నాడు. ముఖ్యంగా 2016లో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. 2016లో ఆర్సీబీ-పంజాబ్ మ్యాచ్‌ను వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 15 ఓవర్లలోనే 200 పైచిలుకు పరుగుల భారీ స్కోర్ సాధించింది. కోహ్లీ సెంచరీతో చెలరేగడంతో ఆర్సీబీకి ఆ స్కోర్ దక్కింది. కేవలం 50 బంతుల్లోనే 12 ఫోర్లు, 8 సిక్సులతో 113 పరుగులు చేసిన కోహ్లీ గ్రౌండ్‌లో విధ్వంసం సృష్టించాడు. అయితే.. ఆ మ్యాచ్‌లో కోహ్లీ చేతికి ఐదు కుట్లతో బ్యాటింగ్ చేశాడు.
ఆ ఇన్నింగ్స్ కోహ్లీ ఆటపై ఉండే అంకిత భావం, గెలవాలనే కసి, పట్టుదలకు చక్కటి ఉదాహరణగా నిలుస్తుందని బాంగర్ తెలిపాడు. చేతికి ఐదు కుట్లు పడితే ఏ ఆటగాడైనా సరే కచ్చితం రెస్ట్ తీసుకుంటాడు. కానీ.. ఆర్సీబీకి కప్ అందించాలనే కోహ్లీ కసి ముందు ఆ కుట్లు చిన్నబోయాయి. పైగా 15 ఓవర్ల మ్యాచ్‌లోనే సెంచరీ బాదడం మరో విశేషం. అతనికి గేల్ కూడా జత కూడి 73 పరుగులు చేయడంతో ఆర్సీబీ 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. బదులుగా పంజాబ్ 14 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసి డక్‌వర్త్ లుయీస్ పద్ధతిలో ఓటమి పాలైంది. మరి ఆ మ్యాచ్‌లో కోహ్లీ ఆడిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat Kohli of 2016 hits different ! pic.twitter.com/ah5SFN9vS6
— Suraj (@suprsuraj) March 23, 2023