గత ఐపీఎల్‌లో దారుణంగా విఫలమైనా కోహ్లీ.. తిరిగి ఆసియా కప్ 2022తో ఫామ్‌లోకి వచ్చాడు. అప్పటి నుంచి నిలకడగానే రాణిస్తున్న కోహ్లీ.. ఈ సారి ఐపీఎల్‌ల్లో తన సత్తా ఏంటో చూపిస్తానని అంటున్నాడు.
ఐపీఎల్ 2023 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. రెండున్నర నెలలపాటు నాన్‌స్టాప్ వినోదాన్ని అందించే ఐపీఎల్ కోసం క్రికెట్ అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ కోసం ఇప్పటికే అన్ని ఫ్రాంచైజ్‌లు సైతం సిద్ధంగా ఉన్నాయి. ప్రధాన ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే వారివారి జట్లతో చేరుతున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఐపీఎల్‌లో అందరి కంటే ఎక్కువ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీమ్‌గా ఆర్సీబీకి గుర్తింపు ఉంది. పైగా విరాట్ కోహ్లీ లాంటి స్టార్ క్రికెటర్ ఆర్సీబీలో ఉండటం ఆ జట్టుకు ప్లస్ పాయింట్.
ఎన్ని ఉన్నా ఏం లాభం.. ఆ జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్పు కొట్టలేదనే విమర్శలు వస్తుంటాయి. కానీ, ఈ ఏడాది ఎలాగైనా కప్పు కొట్టి చూపిస్తామని ఆర్సీబీ మేనేజ్‌మెంట్ పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే 15 సీజన్లు ముగించుకున్న ఐపీఎల్.. 2023తో 16వ సీజన్‌లోకి అడుగుపెట్టనుంది. ఈ సీజన్‌లో ఎలాగైనా ఛాంపియన్‌గా నిలవాలని ఆర్సీబీ పట్టుదలతో ఉంది. పైగా జట్టులోని ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉండటం కూడా ఆర్సీబీ కాన్ఫిడెన్స్‌కు కారణంగా నిలిస్తోంది. ఆ జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేష్ కార్తీక్, రజత్ పటీదార్‌తో ఆర్బీసీ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది.
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తన నుంచి రావాల్సిన అత్యుత్తమ ప్రదర్శన ఇంకా రావాల్సి ఉందని.. అది ఈ సారి ఐపీఎల్‌లో వస్తుందని భావిస్తున్నట్లు కోహ్లీ తెలిపాడు. తన బ్యాటింగ్ జట్టుకు మేలు చేయాలని కోరుకుంటున్నట్లు కోహ్లీ వెల్లడించాడు. దీంతో ఈ సీజన్‌లో తానేంటో చూపిస్తానని కోహ్లీ చెప్పకనే చెప్పాడంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియాపై టెస్టుల్లో భారీ సెంచరీ అలాగే చివరి వన్డేలో హాఫ్ సెంచరీతో కోహ్లీ మంచి టచ్‌లో ఉన్నాడు. ఇక ఓపెనర్‌గా బరిలోకి దిగి.. పరుగులు చేయడం ప్రారంభిస్తే.. కోహ్లీను అడ్డుకోవడం కష్టమే. కాగా, గత సీజన్‌లో కోహ్లీ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. మరి ఈ ఐపీఎల్‌లో ప్రదర్శన గురించి కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat Kohli said, “my best is yet to come which hopefully happens in the IPL 2023. If I can get to the level that I really want to then it’ll help the team”.
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 23, 2023