విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గత దశాబ్దకాలంగా భారత క్రికెట్ కి ఎన్నో చారిత్రాత్మక, మరపురాని విజయాలందించారు. వీరిద్దరూ గ్రీజ్ లో ఉంటే ప్రత్యర్ధులు ఇక మ్యాచ్ మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఫార్మాట్ ఏదైనా ఈ ద్వయం భారీ ఇన్నింగ్స్ లు ఆడడంలో సిద్ధహస్తులు. ఈ నేపథ్యంలో ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించారు. సెంచరీల మీద సెంచరీలు.. ప్రపంచ రికార్డులు.. ఆటగాడిగా మరెన్నో రివార్డులు.. ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉంటాయి. ఇవన్నీ బాగానే ఉన్నా.. ఒక్క విషయంలో మాత్రం వీరు దశాబ్దకాలంగా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ని నిరాశకు గురి చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అభిమానులకి ఇదొక కొత్త టెన్షన్ పట్టుకుంది.
కోహ్లీ, రోహిత్ వ్యక్తి గత రికార్డులు గురించి మాట్లాడుకోవాలంటే చాలానే ఉంటాయి. కానీ వీరిద్దరూ టీమిండియాకు మాత్రం ఐసీసీ టోర్నీ తీసుకురావడంలో ప్రతిసారి ఫెయిల్ అవుతూనే ఉన్నారు. చివరిసారిగా టీమిండియా.. 2013 లో ధోని సారధ్యంలో ఐసీసీ టోర్నీ గెలిచింది. ఇక ఆ తర్వాత మంచి ప్రదర్శన కనబరిచి నాకౌట్ కి వెళ్లినా.. తుది మెట్టుపై నిరాశ తప్పడం లేదు. ముఖ్యంగా స్టార్లుగా పేరొందిన కోహ్లీ, రోహిత్ నాకౌట్ మ్యాచ్ అంటే చేతులెత్తేస్తున్నారు. నాకౌట్ అనగానే వీరిద్దరి మీదే టీమిండియా ఎక్కువగా ఆశలు పెట్టుకుంటుంది. వీరి రికార్డ్ ఒకసారి పరిశీలిస్తే..
2014 టీ 20 వరల్డ్ కప్ ఫైనల్.. ఈ మ్యాచులో కోహ్లీ ఒక్కడే ఒంటరి పోరాటం చేసాడు. రోహిత్ శర్మ మాత్రం విఫలమయ్యాడు. ఇక 2015 వరల్డ్ కప్ ఆస్ట్రేలియా మీద సెమీ ఫైనల్ తీసుకుంటే.. కోహ్లీ సింగల్ డిజిట్ కి అవుట్ కాగా.. రోహిత్ కేవలం 34 పరుగులే చేసాడు. 2016 వెస్టిండీస్ పై టీ 20 వరల్డ్ కప్ సెమి ఫైనల్ మ్యాచులో మాత్రం వీరిద్దరూ రాణించారు. ఇక ఆ తర్వాత 2017లో పాక్ మీద జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ , 2019 కివీస్ తో సెమి ఫైనల్, 2021 ఇక టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో కనీసం వీరిద్దరి నుండి ఒక్క అర్ధ సెంచరీ కూడ రాలేదు. ఈ అన్ని నాకౌట్ మ్యాచుల్లో భారత్ పరాజయం పాలైంది. ఈ విషయమే ఇపుడు డబ్ల్యూటీసీ ఫైనల్ కి ముందు ఇండియన్ ఫ్యాన్స్ ని టెన్షన్ కి గురి చేస్తుంది. మరి ఈ మ్యాచుల్లో వీరిద్దరూ బాగా అది ఈసారైనా టీమిండియాకు డబ్ల్యూటీసీ ఫైనల్ టోర్నీ అందిస్తారో లేదో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.