ఇంగ్లండ్‌తో టెస్టు ఆడేందుకు టీమిండియా అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడి క్లబ్‌తో వార్మప్ మ్యాచ్‌లు కూడా ఆడుతోంది ఇండియన్ టీమ్. ఇప్పటికే ఒక వార్మప్ ముగియగా.. రెండు మ్యాచ్ కోసం సిద్ధమైంది. కాగా.. ఈ మ్యాచ్‌ల మధ్య దొరికే గ్యాప్‌ను విరాట్ కోహ్లీ సంపూర్ణగా ఉపయోగించుకుంటున్నాడు. సందు దొరికితే చాలా షాపింగ్‌లకు వెళ్తున్నట్లు సమాచారం. ఇంగ్లండ్ వీధుల్లో స్వేచ్ఛగా కలియ తిరుగుతున్నాడు. ఇలా కోహ్లీ ఎంతో స్వేచ్ఛగా వీధుల్లో తిరుగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనకు దొరికిన స్వేచ్ఛను కోహ్లీ ఆస్వాదిస్తున్నాడంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. నిజానికి విరాట్ కోహ్లీకి కోట్లలో అభిమానులు ఉన్నారు. మన దేశంలోనే కాక మన శత్రు దేశం పాకిస్థాన్‌లో కూడా కోహ్లీకి అభిమానులు ఉన్నారు.
క్రికెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి విరాట్ కోహ్లీ గురించి కూడా తెలిసి ఉంటుంది. ప్రపంచ క్రికెట్‌లో అంత గుర్తింపు పొందిన కోహ్లీ.. ఇంగ్లండ్‌లో కాబట్టి అంత ఫ్రీగా తిరుగుతున్నాడు. అదే ఇండియాలో అయితే పాపం కోహ్లీకి అంత స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉండదు. అతను సెక్యూరిటీ లేకుండా వీధుల్లోకి వస్తే అతనితో మాట్లాడేందుకు, సెల్ఫీలు దిగేందుకు, ఆటోగ్రాఫ్, ఫొటోగ్రాఫ్‌ల కోసం జనం ఎలా ఎగబడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిమానుల దెబ్బకు కిలో మీటర్లకు కిలో మీటర్లు ట్రాఫిక్ జామ్ అయిపోయి జనజీవనం అస్తవ్యస్తం అవ్వడం ఖాయం. మన దేశంలో కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ అలాంటిది మరి.
కానీ.. ఇంగ్లండ్‌లో మాత్రం కోహ్లీకి స్వేచ్ఛ దొరికింది. వీధుల్లో సాధారణ పౌరుడిగా తిరగాడుతున్నా.. అతన్ని పట్టించుకోనే వారే ఉండరు. కోహ్లీ కూడా అదే కోరుకుంటాడు. ఎంత సెలబ్రెటీ అయినా.. కొంచెం స్వేచ్ఛగా షాపింగ్ చేసుకోవడంలో ఉండే మజనే వేరు. పెళ్లి తర్వాత కుటుంబంతో ఎక్కువ కనిపించే కోహ్లీ.. ఇప్పుడు ఇంగ్లండ్‌లో మాత్రం ఒంటరిగా తిరుగుతున్నాడు. జూలై 1వ తేదీ నుంచి ఇండియా-ఇంగ్లండ్ మధ్య రీషెడ్యూల్ చేసిన టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు దొరికిన కాస్త సమయాన్ని కోహ్లీ ఎంజాయ్ చేస్తున్న సమయంలో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కోహ్లీకి ఇండియాలో ఇలాంటి ఫ్రీడమ్ దొరకడం కష్టం అక్కడైన తిరగని అంటూ కామెంట్ చేస్తున్నారు.
Virat Kohli walking through the streets of Leicester. (Source – Travelexplorergirl Insta page) pic.twitter.com/jJj0h2Uqiz
— Johns. (@CricCrazyJohns) June 24, 2022