విరుష్క.. ఇండియాలో మోస్ట్ పాపులర్ కపుల్స్. కోహ్లీ క్రికెట్‌లో కింగ్ అయితే.. అనుష్క బాలీవుడ్ క్వీన్. మరి ఈ ఇద్దరి పరిచయం ఎలా జరిగింది. ఎప్పుడు డేటింగ్ మొదలుపెట్టారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను కోహ్లీ వెల్లడించాడు.
టీమిండియా సూపర్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మది లవ్ మ్యారేజ్ అనే విషయం తెలిసిందే. విరుష్క జంట.. ఒకరినొకరు అర్థం చేసుకొని, పెళ్లి చేసుకొని ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. వీరికి 2021లో కుందనపు బొమ్మలాంటి కూతురు కూడా పుట్టింది. ఇండియాలోనే మోస్ట్ లవ్‌బుల్ కపుల్స్‌గా ఉన్న కోహ్లీ-అనుష్క మధ్య ప్రేమ ఎప్పుడు మొదలైందనే విషయం చాలా మందికి తెలియదు. అయితే.. అనుష్కను కోహ్లీ తొలిసారి ఎక్కడ కలిశాడు? ఏం మాట్లాడాడు? అసలు కలిసే ముందు కోహ్లీ ఫీలింగ్ ఏంటి? ఇద్దరు డేటింగ్ ఎప్పుడు మొదలుపెట్టారు? ఇలాంటి చాలా ఆసక్తికర విషయాలను కోహ్లీ తాజాగా వెల్లడించాడు.
అనుష్కను కోహ్లీ తొలి సారి 2013లో కలిశాడంటా.. ఆ సందర్భం గురించి మాట్లాడుతూ..‘అనుష్కను తొలిసారి కలిసే ముందు నేను చాలా నెర్వస్‌గా ఫీలయ్యాను. 2013లో తొలిసారి అనుష్కను కలిశాను. జింబాబ్వే టూర్‌కు అప్పుడే నన్ను టీమిండియా కెప్టెన్‌గా ప్రకటించారు. ఆ టూర్‌కు ముందు ఒక యాడ్ షూ ఉంది. ఆ షూట్‌లో అనుష్క శర్మతో కలిసి నటించాల్సి ఉందని నా మేనేజర్ చెప్పాడు. దాంతో చాలా నెర్వస్‌గా ఫీల్ అయ్యాను. అప్పటికే తను బాలీవుడ్ స్టార్ హీరోయిన్. తనను కలిసిన తర్వాత ఎలా మాట్లాడాలి, ముందుగా ఏమని పలకరించాలి అని చాలా హైరానపడ్డాను.
అసలు తను ఎంత ఎత్తు ఉంటుందో కూడా నాకు తెలియదు. ఆ షూట్‌లో తను హైహీల్స్ వేసుకోవడం గమనించాను. నీకు ఇంతకంటే ఎక్కువ హైట్ ఉన్న హైహీల్స్ దొరకలేదా? అని అడిగాను. ఆ జోక్ తనకు నచ్చలేదనుకుంటా.. నిజానికి అది నిజంగానే బ్యాడ్ జోక్. అయితే.. తనతో కొద్ది సేపు మాట్లాడిన తర్వాత ఇద్దరి మధ్య చాలా సిమిలారిటీస్ కనిపించాయి. ఆ తర్వాత కొన్ని సార్లు గెట్ టూ గెదర్లు, ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. కొన్ని రోజులకు డేటింగ్ ప్రారంభించి పెళ్లితో ఒక్కటయ్యాం.’ అని కోహ్లీ వెల్లడించాడు. ఈ విషయాలను కోహ్లీ.. తన ఫ్రెండ్ మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్‌తో జరిగిన చిట్‌చాట్‌లో వెల్లడించాడు. కాగా.. కోహ్లీ-అనుష్క ఇద్దరూ రెండు రంగాల్లో మంచి స్థాయిలో ఉన్నప్పటికీ టైమ్ దొరికితే.. ఇద్దరూ జంటగా కనిపిస్తుంటారు. మరి ఫస్ట్ మీటింగ్ గురించి కోహ్లీ చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
AB De Villiers interviewing Virat Kohli on the ‘Three Sixty’ YouTube. pic.twitter.com/DlqxewBTtz
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 21, 2023
Jai Mahakal 🕉️. Spirituality is the most important thing in life. Virat Kohli is lucky to have Anushka Sharma as a Wife❤️😍.#ViratKohli𓃵 pic.twitter.com/BSkLMV1k5h
— Shashank (@Shashank18_71) March 12, 2023