టీమిండియా టీ20 కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ప్రస్థానం ముగిసింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ వేదికగా కెప్టెన్ గా నమీబియాతో కోహ్లీ చివరి మ్యాచ్ ఆడేశాడు. ముందుగా ప్రకటించినట్టే ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్సీ బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకున్నాడు. కోహ్లీ సారథ్యంలో టీమిండియా పొట్టి క్రికెట్‌లో ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. కెప్టెన్‌గా తన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తూ అందుకోసం కోహ్లీ కొన్ని త్యాగాలు కూడా చేయాల్సి వచ్చింది. వ్యక్తిగతంగా తన ప్రదర్శన కంటే భవిష్యత్తులో.. టీమిండియాకు మెరికల్లాంటి ఆటగాళ్లను ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో తన ఫిక్స్‌డ్ స్పాట్ వన్‌డౌన్‌ను కూడా త్యాగం చేశాడు. జట్టు అవసరాల కోసం కొన్ని సార్లు, యువ ఆటగాళ్లకు అవకాశలు ఇచ్చి వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపేందుకు కొన్ని సార్లు తన బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకున్నాడు. తన తర్వాత టీ20 జట్టు పగ్గాలు ఎవరు చేపట్టబోతున్నారో కూడా బయటపెట్టాడు.
ఇదీ చదవండి: టీమిండియా హెడ్ కోచ్ గా రవిశాస్త్రి పదవీకాలం ముగింపు..
టీమిండియా టీ20 జట్టు పగ్గాలను సీనియర్ ఓపెనర్.. ఐపీఎల్ స్టార్ కెప్టెన్ రోహిత్ శర్మకు అప్పగించనున్నారు. ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ చెప్పకనే చెప్పాడు. చాలా రోజులుగా జట్టు బాధ్యతలు రోహిత్ శర్మ చూసుకుంటున్నట్లు బయటపెట్టాడు. అంటే కోహ్లీ తర్వాత ఆ స్థానాన్ని రోహిత్ చేపట్టనున్నాడని తేటతెల్లమైంది. ఐపీఎల్ లో ముంబయి జట్టు కెప్టెన్ గా ఐదు ట్రోఫీలు అందజేసిన ట్రాక్ రికార్డు రోహిత్ సొంతం. టీ20 కెప్టెన్ గా మోస్ట్ సక్సెస్ రేట్ రోహిత్ శర్మ సొంతం. చాలా మంది మాజీలు సైతం జట్టు బాధ్యతలు రోహిత్ కే అప్పజెప్పాలని అభిప్రాయపడ్డారు. కోహ్లీ తర్వాత ఆ స్థానాన్ని రోహిత్ శర్మానే భర్తీ చేయగలడు? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.