డౌన్‌టైమ్ అంటూ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఇది చూసిన కోహ్లీ అభిమానులు కీలకమైన మ్యాచ్‌కు ముందు ఇదేంటి? అసలు కోహ్లీ కాళ్లకు ఏమైందని? అంటూ ఆందోళన చెందుతున్నారు. సోమవారం కేకేఆర్‌తో ఆర్సీబీ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే క్వాలిఫైయర్2లో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఇలాంటి కీలక సమయంలో కోహ్లీ కాళ్ల నొప్పితో మ్యాచ్ ఆడకపోతే ఎలా అంటూ ఆర్సీబీ అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. అయితే నిర్వీరామంగా క్రికెట్ ఆడుతున్న విరాట్ ఫ్లేఆఫ్ మ్యాచ్‌కు కాస్తా విశ్రాంతి తీసుకున్నాడు అంతే. వార్మింగ్ మెషీన్‌తో కాళ్లను రిలాక్స్ చేస్తున్నాడు. కీలకమైన మ్యాచ్‌కు ముందు చిన్న బ్రేక్ తీసుకుని ఇలా రిలాక్స్ అవుతూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు పెట్టాడు. కాగా అద్భుత ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ఈ సారీ ఎలాగైన ఐపీఎల్ టైటిల్ సాధించి, ఆర్సీబీ కెప్టెన్సీకి ఘనంగా వీడ్కోలు చెప్పాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.