బ్యాటింగ్‌లో సచిన్ తర్వాత విరాట్ కోహ్లీనే కింగు. పరుగుల విషయంలో అయినా.. సెంచరీల విషయంలో అయినా.. కానీ.. ఫిట్‌నెస్ విషయంలో మాత్రం కోహ్లీని మించిన ఆటగాడు క్రికెట్ ప్రపంచంలో ఇంకోడు లేడు. దానికి ఇదే సాక్ష్యం..
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒంటి చేత్తో మ్యాచ్‌లను గెలిపించగలడ సమర్థుడు. ఆటతో పాటు.. ఫిట్‌నెస్ విషయంలోనూ కోహ్లీ కింగే. గాయంతో నేషనల్ క్రికెట్ అకాడమీకి ఇంతవరకు వెళ్లని ఒకే ఒక్క క్రికెటర్ కోహ్లీనే. అది అతని ఫిట్‌నెస్ లెవెల్‌ను తెలియజేస్తుంది. వికెట్ల మధ్య సింగిల్స్, డబుల్స్ కోసం కోహ్లీ పరిగెడుతుంటే.. జింక కోసం పరిగెత్తే చిరుత పులిలా ఉంటాడు. ఫీల్డింగ్‌లోనూ కోహ్లీ విన్యాసాలు చాలానే చూశాం. ఇండియన్ టీమ్‌లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా యువ క్రికెటర్లకు ఆటలో కానీ, ఫిట్‌నెస్‌లో కానీ కోహ్లీ మించి ఇన్స్‌పైర్ చేసే క్రికెటర్ ఈ తరంలో లేడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ విషయంలో భారత క్రికెట్‌కు కొత్త అర్థం చెప్పారు. వీరి హయాంలోనే భారత జట్టు ఆటగాళ్లు ఆటతో పాటు ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు.
తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలోనూ మరోసారి కోహ్లీ ఫిట్‌నెస్ లెవెల్స్ ఏంటో తెలిసొచ్చింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పాండ్యా బౌలింగ్‌లో ఆసీస్ బ్యాటర్.. మిడి వికెట్ వైపు బాల్‌ను పుష్ చేశాడు. ఆ ప్లేస్‌లో ఫీల్డర్ లేకపోవడంతో.. షార్ట్ కవర్స్‌లో ఉన్న కోహ్లీ.. మెరుపు వేగంతో షార్ట్ కవర్స్ నుంచి మిడి వికెట్ వైపు పరిగెత్తి.. మిడ్ వికెట్ బౌండర్ లైన్ వద్ద ఉన్న ఫీల్డర్ రావడానికి కంటే ముందే.. బాల్ దగ్గరకి చేరుకుని బాల్‌ను తిరిగి వికెట్ కీపర్‌కు అందించాడు. కేవలం 6 సెకన్లలో షార్ట్ కవర్స్ నుంచి మిడ్ వికెట్‌కు చేరుకున్నాడు. కోహ్లీ పరిగెత్తిన వేగం చూస్తుంటే.. చిరుత పులి సైతం చిన్నబోయేలా ఉంది. కోహ్లీ రన్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. శుక్రవారం ముంబై వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను భారత పేసర్లు 188 పరుగులకే కుప్పకూల్చారు. ఈ స్వల్ప టార్గెట్‌ను ఛేదించేందుకు భారత బ్యాటర్లు సైతం చెమటలు చిందించారు. ఇషాన్ కిషణ్(3), విరాట్ కోహ్లీ(4), సూర్యకుమార్ యాదవ్(0), శుబ్‌మన్ గిల్(20) విఫలం అవ్వగా.. కేఎల్ రాహుల్(75), జడేజా(45) పరుగులతో రాణించడంతో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక రెండో వన్డే ఆదివారం విశాఖపట్నంలో జరగనుంది. మూడో వన్డే చెన్నైలో నిర్వహించనున్నారు. మరి ఆ రెండు వన్డేలు కూడా గెలిచి.. సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది. మరి తొలి వన్డేలో విరాట్ కోహ్లీ రన్నింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
That Running by Virat Kohli was Unreal 😮😮#INDvAUS pic.twitter.com/ZgsD3FfY2G
— RVCJ Media (@RVCJ_FB) March 18, 2023