క్రికెట్ అభిమానులు మూడేళ్లుగా ఎదరుచూస్తున్న క్షణం ఆసియా కప్‌లో ఆవిష్కృతమైంది. సింగిల్ తీసినంత ఈజీగా సెంచరీలు కొట్టిన కోహ్లీ 71వ సెంచరీ ఎప్పుడెప్పుడు చేస్తాడా అంటూ యావత్ క్రికెట్ ప్రపంచం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూసింది. కోహ్లీ సైతం పరుగులు చేస్తున్నా.. సెంచరీ రాక ఇబ్బంది పడ్డాడు. మాజీ క్రికెటర్ల విమర్శలు సైతం ఎదుర్కొన్నాడు. వీటన్నింటికీ తెర దించుతూ అఫ్ఘనిస్థాన్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడి సెంచరీతో కదంతొక్కాడు. 61 బంతుల్లోనే 12 ఫోర్లు, 6 సిక్సులతో 122 పరుగులు చేసి టీ20ల్లో టీమిండియా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు. కోహ్లీ కొడితే ఇలా ఉంటుందని మరోసారి చూపించాడు. దీంతో చాలా కాలంగా కోహ్లీ సెంచరీ కోసం ఎదురుచూసిన క్రికెట్ అభిమానులు సంబురాలు చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన కోహ్లీనే. ఫేస్‌బుక్ పోస్టులు, ట్వీట్స్, వాట్సప్ స్టేటస్స్‌లతో నింపేశారు. కోహ్లీ కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన ఈ సెంచరీను మరింత ప్రత్యేకం చేస్తూ.. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ ఒక ర్యాప్ సాంగ్‌తో వీడియో రిలీజ్ చేసింది.
ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. కోహ్లీ ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకుంటున్నారు. షేర్లు, లైకులతో హోరెత్తిస్తున్నారు. కోహ్లీ బ్యాటింగ్ స్లైట్, కోహ్లీ గొప్పతనం, కొట్టే షాట్లు గురించి వివరిస్తూ.. సాగే ర్యాప్ సాంగే ఆకట్టుకునేలా ఉంది. నిజానికి కోహ్లీ 71వ సెంచరీపై కేజీఎఫ్ బీజీఎం సాంగ్స్‌తో వీడియో చేస్తున్నట్లు వార్తలు వచ్చినా.. ఒక ప్రత్యేకమైన ర్యాప్ సాంగ్‌ను కోహ్లీపై రాయించి.. సెంచరీ చేసిన విజువల్స్‌తో అద్భుతంగా ఎడిట్‌చేశారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన కోహ్లీ సెంచరీ గురించే టాక్. ఈ టైమ్‌లో ఈ సాంగ్ మరో సెన్సెషన్ అనే చెప్పాలి. మరి కింద ఉన్న ఈ సాంగ్‌ను విని.. ఎలా ఉందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: కింగ్ కోహ్లీ సెంచరీ చేస్తే రికార్డుల వర్షమే! 1 కాదు, 2 కాదు.. ఏకంగా 12 రికార్డులు
Still thinking about #ViratKohli‘s 𝟕𝟏𝐬𝐭 𝐜𝐞𝐧𝐭𝐮𝐫𝐲! 🥺💙
DP World #AsiaCup2022 #BelieveInBlue #TeamIndia #KingKohli | @imVkohli pic.twitter.com/u6amxNFEPD
— Star Sports (@StarSportsIndia) September 10, 2022