‘ఐపీఎల్ 2021’ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. చైన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఫైనల్ చేరింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై సునాయాస విజయంతో చెన్నై ఫైనల్ చేరింది. ఈ మ్యాచ్‌లో చెన్నై అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మ్యాచ్‌ని సిక్స్ గానీ, ఫోర్ గానీ కొట్టి ఫినిష్ చేస్తే ఆ కిక్కే వేరప్ప. ‘ది ఫినిషర్ ఈజ్ బ్యాక్’ అంటూ ఎగిరి గంతులేశారు. ఇప్పటివరకు ధోనీ పని అయిపోయింది అని కామెంట్ చేసిన అందరికీ.. ధోనీ తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. ఇంకా ఫినిషర్ అలాగే ఉన్నాడని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇప్పటివరకు ఈ సీజన్‌లో ధోనీని అలా చూడలేదు. మైదానంలోకి అడుగుపెట్టడమే రెండో బంతిని భారీ సిక్స్‌గా మలిచిన మహీని చూసి అందరూ సంబరాల్లో మునిగిపోయారు. చెన్నై అభిమానులే కాదు.. యావత్ క్రికెట్ అభిమానులు ధోనీ ఫినిషింగ్ చూసి మెస్మరైజ్ అయ్యారు.
ఇదీ చదవండి: యాంకర్ సుమకు అరుదైన వ్యాధి.. షాక్‌లో అభిమానులు..
ధోనీ బ్యాటింగ్ చూసి క్రికెట్ దిగ్గజాలు సైతం అనందంలో మునిగిపోయారు. వారందరిలో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందన ఎంతో ప్రత్యేకం అనే చెప్పాలి. అదర్ ఎండ్‌లో ఉండి ధోనీ గేమ్ ఎంతగానో ఆశ్వాదించే విరాట్‌కు ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో ఆ అవకాశం లేదు. ఐపీఎల్ మాత్రమే ధోనీ గేమ్ చూసే అవకాశం ఉంది. తను ఫామ్‌లోకి రావడానికి ఎంతో కష్టపడ్డాడు. చాలా గ్యాప్ తర్వాత ధోనీ ఫినిష్ చూసి ఎంతో సంతోషించాడు విరాట్. అదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ‘ది కింగ్ ఈజ్ బ్యాక్.. క్రికెట్‌లో అతను గ్రేటెస్ట్ ఫినిషర్. ధోనీ ఫినిషింగ్ షాట్ చూసి నేను కుర్చీలోంచి ఎగిరి గంతేశాను’ అంటూ కోహ్లీ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. ది ఫినిషర్ ఈజ్ బ్యాక్ అనే మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి
Anddddd the king is back ❤️the greatest finisher ever in the game. Made me jump Outta my seat once again tonight.@msdhoni
— Virat Kohli (@imVkohli) October 10, 2021