టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఎన్నో గొప్ప రికార్డులు సాధించాడు. క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకానీ రికార్డు వంద సెంచరీల రికార్డును సచిన్ టెండూల్కర్ సృష్టించాడు. అతని రికార్డులను బ్రేక్ చేయగల ఆటగాడు ప్రస్తుతం క్రికెట్‌లో ఎవరున్నారంటే వినిపించే ఒకే ఒక పేరు విరాట్ కోహ్లీ. ఇప్పటికే కోహ్లీ అన్ని ఫార్మాట్లలో కలిపి 70 సెంచరీలు చేశాడు. కానీ 71 సెంచరీ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసేలా చేస్తున్నాడు. దాదాపు మూడేళ్ల నుంచి విరాట్ కోహ్లీ సెంచరీ చేయలేదు.
కోహ్లీ సెంచరీ కోసం కోట్లలో ఉన్న అతని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోహ్లి అభిమానులే గాక.. పాక్ క్రికెటర్లు సహా ఆ దేశ క్రికెట్ అభిమానులు కూడా కోహ్లి సెంచరీ కోసం పరితపిస్తుండడం విశేషం. ఈ విషయాన్ని పీఎస్‌ఎల్(పాకిస్తాన్ సూపర్ లీగ్)లో పాల్గొంటున్న ఇస్లామాబాద్ యునైటెడ్ స్ట్రాటెజీ మేనేజర్ హసన్ చీమా తన ట్విటర్‌లో వెల్లడించాడు. ”పీఎస్‌ఎల్ గురించి ఎక్కువగా ట్వీట్ చేయకూడదు అనుకున్నా. కానీ ఒక విషయం నాకు జీర్ణం కావడం లేదు. పీఎస్‌ఎల్‌లో ఆడుతున్న పాక్ ఆటగాళ్ల దగ్గర నుంచి అభిమానుల వరకు ఒక విషయాన్ని బలంగా కోరుకుంటున్నారు.
Only Indian Cricketer to have Huge fanbase even in Pakistan 🔥🙏@imVkohli is so Blessed ❤️ pic.twitter.com/hEd3lhVt55
— Virat Kohli Trends™ (@TrendVirat) January 27, 2022
అదేంటంటే.. కోహ్లి 71వ సెంచరీ అందుకోవాలని. దీనికోసం పాక్ ఆటగాళ్లు సహా ఫ్యాన్స్ మొక్కుకుంటున్నారు అని పేర్కొన్నాడు. కోహ్లీకి పాక్‌లో అభిమానులు ఉన్న విషయంలో తెలిసిందే. కానీ ఈ రేంజ్‌లో అభిమానులు తమ అభిమానం చూపిస్తుండడం మాత్రం కచ్చితంగా విశేషమే. మరి కోహ్లీపై పాకిస్థానీయులు చూపిస్తున్న అభిమానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.