రన్ మెషీన్ విరాట్ కోహ్లీ పేస్ బౌలింగ్‌తో పాటు స్పిన్‌ను సైతం అద్భుతంగా ఆడగలడు. కానీ.. ఓ యువ స్పిన్నర్ బౌలింగ్‌లో మాత్రం ప్రతిసారి తడబడుతున్నాడు. 4 ఇన్నింగ్స్‌ల్లో 3 సార్లు అతని బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు.
ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా తడబడుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న టీమిండియా.. 84 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఫామ్‌లో లేని కేఎల్ రాహుల్ స్థానంలో ఈ మ్యాచ్ ఆడుతున్న శుబ్‌మన్ గిల్ సైతం నిరాశపరిచాడు. 18 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేసి మంచి టచ్‌లో కనిపించిన గిల్.. స్పిన్‌ను అంచనా వేయలేక స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ(12), పుజారా(1), జడేజా(4), శ్రేయస్ అయ్యర్(0) దారుణంగా విఫలం అయ్యారు. కేవలం 45 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో విరాట్ కోహ్లీ(22), కేఎస్ భరత్(17) టీమిండియాను ఆదుకున్నట్లు కనిపించినా.. కోహ్లీ సైతం స్పిన్ బౌలింగ్‌లోనే అవుట్ అయి నిరాశ పరిచాడు.
ఆస్ట్రేలియా యువ బౌలర్ టాడ్ మర్ఫీ బౌలింగ్‌లో కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అప్పటికే రెండు అద్భుత షాట్లతో బౌండరీలు బాది మంచి రిథమ్‌లో కనిపించిన కోహ్లీ, పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుండటంతో మంచి డిఫెన్స్ కూడా ఆడాడు. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ అవుటైన బంతులను కూడా కోహ్లీ డిఫెన్స్ ఆడి.. ఇక ఈ పిచ్‌పై కుదురుకున్నట్లే అనుకుంటున్న టైమ్‌లో మర్ఫీకి వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే.. కోహ్లీ, మర్ఫీ బౌలింగ్‌లో అవుట్ అవ్వడం ఇదే మొదటి సారి కాదు. ఈ సిరీస్‌లో ఇది మూడో సారి.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మొత్తం నాలుగు సార్లు బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ మూడు సార్లు మర్ఫీ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఒక్క ఇన్నింగ్స్ మాత్రమే ఆడింది. ఆ ఇన్నింగ్స్‌లో కోహ్లీ 12 రన్స్ చేసి మర్ఫీ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. అలాగే ఢిల్లీలో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మర్ఫీ బౌలింగ్‌లోనే స్టంప్ అవుట్ అయ్యాడు. టెస్టు క్రికెట్‌లో కోహ్లీ తొలి సారి స్టంప్ అవుట్ అయింది ఈ మ్యాచ్‌లోనే. మళ్లీ ఇప్పుడు ముచ్చటగా మూడో సారి మర్ఫీకి తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. మూడు సార్లు మూడు విధాలుగా అవుట్ అవ్వడం విశేషం. దీంతో కోహ్లీ.. మర్ఫీ బౌలింగ్‌ను అంచనా వేయలేకపోతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా స్పిన్‌ను అద్భుతంగా ఆడే కోహ్లీ.. మర్ఫీని మాత్రం ఆడలేకపోతున్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
His comeback would be a greatest one #ViratKohli𓃵 pic.twitter.com/J47uZIfiBb
— aftab (@aftab169) March 1, 2023