టీమిండియా కెప్టెన్.. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ అటు మైదానంలోనే కాదు ఇటు సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా ఉంటాడు. కోహ్లీ ఏ పోస్టు పెట్టినా ఇట్టే వైరల్ అవుతుంది. ట్విట్టర్, ఇన్‌స్టాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్న విరాట్ కోహ్లీ పోస్టులు వైరల్ కావడం వింతేముందిలే అంటారా. విరాట్ ఆటలో ఎంత దూకుడుగా ఉంటాడో.. సోషల్ మీడియాలో అంత జోవియల్‌గా ఉంటాడు. క్రికెట్ ఒక్కటే కాదు.. ఇమిటేషన్ కూడా చాలా బాగా చేస్తాడు కోహ్లీ. అలా ఇప్పుడు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్‌ను ఇమిటేట్ చేసిన వీడియో ఒకటి తెగ వైరలవుతోంది. శిక్కీ హౌజ్ దిస్ వన్? అంటూ విరాట్ తన ఇన్‌స్టా, ట్విట్టర్ ఖాతాల్లో వీడియో పోస్ట్ చేశాడు. ధావన్‌ను డిటో దించేశాడు కోహ్లీ. మరి ఆ వీడియో మీరూ చేసేయండి.