కోహ్లీ ఎంత సరదా మనిషో అందరికి తెలిసిందే. ఆటతో పాటు గ్రౌండ్‌లో డ్యాన్సులు వేస్తూ.. ప్రేక్షకులను వినోదాన్ని పంచుతుంటాడు. జట్టులోని మిగతా ఆటగాళ్లతో ఎంతో సరదాగా ఉంటాడు. తాజాగా చెన్నైలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డేలోనూ కోహ్లీ లుంగి డ్యాన్స్‌తో అదరగొట్టాడు.
టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గ్రౌండ్‌లో ఎంత అగ్రెసివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిస్టర్ కూల్ కెప్టెన్ ధోని తర్వాత భారత కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన కోహ్లీ.. ధోనికి పూర్తి భిన్నంగా వ్యవహరించేవాడు. ఫీల్డ్‌లో ఉన్నప్పుడు చాలా అగ్రెసివ్‌గా ఉండేవాడు. అయితే ఇదంతా మ్యాచ్ జరుగుతున్నంత సేపే.. ఒక్కసారి మ్యాచ్ ముగిసి, ఆఫ్ ది ఫీల్డ్‌లోకి వచ్చాకా కోహ్లీకి మించిన సరదాగా ఉండే క్రికెటర్ మరొకరు లేరు. సీనియర్లతో అయినా, జూనియర్లతో అయినా కోహ్లీ ఎంత సరదాగా కలిసి మెలసి ఉంటాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత కోహ్లీలోని చిలిపితనం మరింత పెరిగింది. యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్‌ను కోహ్లీ టీజ్ చేసే విధానం చూస్తేనే కోహ్లీ జట్టులో ఎంత సరదాగా ఉంటాడో అర్థమవుతుంది.
అయితే.. కెప్టెన్సీ వదులుకున్న తర్వాత మరింత సరదాగా ఉంటున్న కోహ్లీ ఈ మధ్య గ్రౌండ్‌లోనే తెగ డ్యాన్సులు వేస్తున్నాడు. ఇటివల ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్ వేసిన కోహ్లీ.. తాజాగా చెన్నైలో జరుగుతున్న మూడో వన్డేలో షారుఖ్ ఖాన్ హిట్ మూవీ చెన్నై ఎక్స్‌ప్రెస్‌లోని లుంగి డ్యాన్స్‌కు స్టెపులు వేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలుత ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది. దీంతో.. ఫీల్డింగ్‌కు వెళ్లే ముందు టీమ్ మీటింగ్‌కి ముందు కోహ్లీ లుంగి డ్యాన్స్‌కు స్టెప్పులు వేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలుత బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయించాడు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ ఆస్ట్రేలియాకు మంచి ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించి ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని హార్దిక్ పాండ్యా విడదీశాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన పాండ్యా ఐదో బంతికి ట్రావిస్ హెడ్‌ను అవుట్ చేశాడు. తన తర్వాతి ఓవర్‌లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను అవుట్ చేశాడు. ఆ వెంటనే మరో ఓవర్‌లో ఓపెనర్ మార్ష్‌ను అవుట్ చేశాడు. ఇలా వరుస ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టి.. పటిష్ట స్థితిలో ఉన్న ఆస్ట్రేలియాను దెబ్బతీశాడు. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే.. సిరీస్ వారి సొంత కానుంది. మరి ఈ మ్యాచ్‌లో పాండ్యా ప్రదర్శనతో పాటు మ్యాచ్‌కు ముందు కోహ్లీ వేసిన లుంగి డ్యాన్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— javed ansari (@javedan00643948) March 22, 2023