‘ఐసీసీ టీ20 వరల్డ్ కప్’లో టీమిండియాకు శుభారంభం అయితే లభించలేదు. పాకిస్తాన్‌తో 10 వికెట్ల తేడాతో మ్యాచ్ ఓడిపోవడం టీమిండియా అభిమానులను ఎంతో ఆవేదనకు గురిచేసిన విషయం తెలిసిందే. అదంతా గతం ఇప్పుడు రాబోయే మ్యాచ్ మీదే టీమిడింయా గురి మొత్తం. అందుకు తగిన కసరత్తు కూడా మొదలు పెట్టారు. నెట్స్‌లో అందరూ తమ నూరు శాతం అందించేందుకు కృష్టి చేస్తున్నారు. బ్యాటింగ్ మాత్రమే కాదు.. బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విషయాల్లో మెరుగయ్యేందుకు కృషి చేస్తున్నారు. మరోవైపు హార్దిక్ పాండ్యా కూడా నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ కనిపించాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ కూడా చేస్తూ ఫామ్‌లోకి వస్తే టీమిండియాకు మంచి బలమే అవుతుంది.
ఇదీ చదవండి: బిగ్ బ్రేకింగ్: తెలంగాణలో ఏవై.4.2 వేరియంట్!
నెట్స్‌లో కోహ్లీ కష్టం
కోహ్లీ బ్యాటింగ్ పరంగా మంచి ఫామ్‌లో ఉన్నాడు. వార్మప్ మ్యాచ్‌లే కాదు.. పాకిస్తాన్‌తోనూ హాఫ్ సెంచరీ చేసి కోహ్లీ(57) శభాష్ అనిపించుకున్నాడు. కానీ, మరింతగా రాణించేందుకు కోహ్లీ నెట్స్‌లో ఎంతో కృషి చేస్తూ కనిపించాడు. మెరుపు బ్యాటింగ్‌కు ప్రేక్షకులే కాదు.. శ్రేషస్ అయ్యర్, ఇషాన్ కిషన్ ఫిదా అయిపోయారు. కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే కళ్లార్పకుండా చూస్తూ ఉండిపోయారు. కోహ్లీ బ్యాటింగ్ చూస్తూ వాళ్లు కూడా ఏ బాల్ ఎలా ఆడాలో నేర్చుకుంటున్నట్లు కనిపించింది. ఒక అభిమానిలా వాళ్లు అలా బ్యాటింగ్ ఎంజాయ్ చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. నెట్టింట టీమిండియా ప్రాక్టీస్ వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కోహ్లీ ఈ ఫామ్ కంటిన్యూ చేస్తే న్యూజిలాండ్‌పై గెలవడం అన్నది ఖాయమే అవుతుంది. అంతేకాకుండా న్యూజిలాండ్‌పై ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి కూడా ఉంది. న్యూజిలాండ్‌పై భారత్ విజయం ఖాయం అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.