ఆస్ట్రేలియాతో ఇండోర్‌లో జరుగుతున్న మూడో టెస్టులో విరాట్ కోహ్లీ చేతికి గాయమైంది. బాల్ నేరుగా తాకడంతో నొప్పితో విలవిల్లాడిపోయాడు. వెంటనే ఫిజియో వచ్చి కోహ్లీకి ఫస్ట్ ఎయిడ్ అందించారు.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గాయపడ్డాడు. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టు జరుగుతోంది. ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో మన జట్టు తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకు ఆలౌటైపోయింది. 22 పరుగులు చేసిన కోహ్లీ.. స్పిన్నర్ మర్ఫీ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 197 పరుగులకు ఆలటైంది. స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తున్న ఈ పిచ్ పై అశ్విన్, ఉమేశ్ యాదవ్, జడేజా అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టారు. అలా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు తడబడుతూనే ఆడుతోంది. సరిగ్గా ఇలాంటి టైంలో కోహ్లీకి గాయమైందనే విషయం ఫ్యాన్స్ ని కలవరపెట్టింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో కోహ్లీ నుంచి ఫ్యాన్స్ కాస్త గట్టిగానే ఎక్స్ పెక్ట్ చేశారు. అయితే ఇదే మ్యాచులో మళ్లీ స్పిన్నర్ బౌలింగ్ లోనే ఔటయ్యాడు. అయితే కునెమాన్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఓ షాట్ ఆడుతూ కోహ్లీ బొటనవేలికి గాయమైంది. దీంతో ఫిజియో వచ్చి అతడి వేలికి కట్టు కట్టాడు. ఇది జరిగిన కాసేపటికే అంటే నాలుగు పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ.. 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటై పెవిలియన్ కు చేరాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఈ గాయం చిన్నదా పెద్దదా అనేది తెలియాల్సి ఉంది. మరి కోహ్లీ గాయపడటంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
#ViratKohli𓃵 #BGT2023 #INDvsAUS pic.twitter.com/qRI9dV6OUa
— Sayyad Nag Pasha (@nag_pasha) March 2, 2023