భారత్-వెస్టిండీస్ మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం రాత్రి కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత ఫీల్డిండ్ ఎంచుకున్న టీమిండియా విండీస్‌ను ఒక మోస్తారు స్కోర్‌కే కట్టడి చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విండీస్ 157 పరుగులు చేసింది. వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ నికోలస్ పూరన్ 43 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 61 పరుగులతో అదరగొట్టాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ రోహిత్ 40 పరుగులతో రాణించాడు. కాగా ఈ మ్యాచ్‌లో విండీస్ బ్యాటింగ్ సందర్భంగా 8వ ఓవర్ వేస్తున్న రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ ప్యాడ్‌కు తగిలి బంతి కీపర్ పంత్ చేతుల్లో పడింది. దాన్ని టీమిండియా ఆటగాళ్లు అవుట్‌గా అపీల్ చేశారు. కానీ అంపైర్ దాన్ని వైడ్‌గా ప్రకటించాడు. దీంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రివ్యూ కోరాలా? వద్దా? అనే సందేహంతో ఉన్నాడు. అసలు అంపైర్ దాన్ని వైడ్ ఇవ్వడంపై కూడా రోహిత్ అసహనం వ్యక్తం చేశాడు.
pic.twitter.com/zUFGUyYiYb
— Maqbool (@im_maqbool) February 16, 2022
అనంతరం టీమిండియా ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ రెండు శబ్ధాలు వచ్చాయి అని గట్టిగా చెప్పడంతో రోహిత్ రివ్యూకు వెళ్లాడు. కానీ అప్పటికే అంపైర్ చెక్ కోరడంతో థర్డ్ అంపైర్ పరిశీలించి దాన్ని కరెక్ట్ బాల్‌గా ప్రకటించాడు. అదే సమయంలో బంతి బ్యాట్‌కు తగలలేదని తేలింది. అంపైర్ ఆ బాల్ వైడ్ కాదని సిగ్నల్ ఇచ్చాడు. కాగా ఈ మొత్తం వ్యవహారంలో కోహ్లీ, రోహిత్ రివ్యూ గురించి మాట్లాడుకోవడం హైలెట్‌గా నిలిచింది. పైగా వాళ్లు మాట్లాడే మాటలు స్టంప్స్ మైక్‌లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కోహ్లీ, రోహిత్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని మరోసారి రుజువైంది. మరి వీరిద్దరి చర్చలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.