టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ గురించి టీమిండియా మరో మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నాడని.. కానీ ఒక విషయంలో అతను మరింత మెరుపర్చుకోవాలని సూచించాడు. కాగా.. కోహ్లీ గతేడాది ఆసియా కప్2022 కంటే ముందు సరైన ఫామ్‌లో లేక ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నాడు. పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్న కోహ్లీ కాస్త విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుని.. ఆసియా కప్ కంటే ముందు రెండు సిరీస్‌లకు దూరంగా ఉన్నాడు. దాదాపు ఆరు వారాల విశ్రాంతి తీసుకుని.. ఫ్రెస్‌మైండ్‌తో వచ్చిన కోహ్లీ.. ఆసియా కప్‌లో అదరగొట్టాడు. తన పూర్వ ఫామ్‌ను అందుకున్న కోహ్లీ.. అక్కడి నుంచి మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు.
ఆసియా కప్‌లో అఫ్ఘానిస్థాన్‌పై తన 71వ సెంచరీ బాదేసిన కోహ్లీ.. ఆ తర్వాత ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్‌లోనూ దుమ్ములేపాడు. పాకిస్థాన్‌పై ఆడిన 82 పరుగుల ఇన్నింగ్స్ అయితే.. కోహ్లీ కెరీర్‌లోనే బెస్ట్ టీ20 ఇన్నింగ్స్‌గా నిలిచిపోయింది. ఆ టోర్నీలో కోహ్లీ మొత్తం నాలుగు హాఫ్ సెంచరీలతో రెచ్చిపోయాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్, శ్రీలంక, న్యూజిలాండ్‌లతో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించి.. మరో మూడు సెంచరీలు బాదేశాడు. అయితే.. ఫామ్‌లేక ఇబ్బంది పడుతున్న కోహ్లీ.. ఆసియా కప్‌కు ముందు తీసుకున్న రెస్ట్ అతనికి ఎంతో ఉపయోగపడిందని.. మానసికంగా కోహ్లీకి మంచి బూస్టప్ ఇచ్చినట్లు చాలా మంది క్రికెట్ నిపుణులు పేర్కొన్నారు.
అయితే.. కోహ్లీ ఫామ్‌లో లేని సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ.. కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. విశ్రాంతి తర్వాత కోహ్లీ తన పూర్వపు ఫామ్‌ను అందుకుంటాడని, కోహ్లీపై తమకు పూర్తి నమ్మకం ఉందని ప్రకటించాడు. గంగూలీ అన్నట్లుగానే విశ్రాంతి తర్వాత తిరిగొచ్చిన కోహ్లీ.. దుమ్ములేపుతున్నాడు. మరోసారి వింటేజ్ కోహ్లీని చూపిస్తున్నాడు. అయితే.. టీ20లు, వన్డేల్లో అద్భుతంగా ఆడుతున్నా.. టెస్టు క్రికెట్‌లో కోహ్లీ మరింత ఇంప్రూవ్ అవ్వాలని గంగూలీ పేర్కొన్నాడు. ఎందుకంటే టీమిండియా బ్యాటింగ్ విషయంలో కోహ్లీపై ఆధారపడుతుందని.. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో కోహ్లీ మెరుగుపడాలని దాదా అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో కోహ్లీ పెద్దగా రాణించలేదనే విషయం తెలిసిందే. మరి గంగూలీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#Exclusive: BCCI के पूर्व अध्यक्ष @SGanguly99 ने आजतक से बात करते बताया कि WPL की योजना उनके कार्यकाल के दौरान बनाई गई थी. पूर्व भारतीय कप्तान ने #ViratKohli को भी एक अहम सुझाव दिया है. #ReporterDiary #Cricket (@AnirbanSinhr) pic.twitter.com/W7fP0KiyhU
— AajTak (@aajtak) January 27, 2023