విరాట్ కోహ్లీ ఫ్యాన్స్.. ఈ ఆర్టికల్ ని కాస్త గుండెరాయి చేసుకుని చదవండి! ఎందుకంటే ఇది మీ కోహ్లీ కెరీర్ కు సంబంధించిన విషయం కాబట్టి. ఇక టీమిండియా ప్రదర్శన ఎలా ఉన్నాసరే.. 2022లో విరాట్ కోహ్లీ మాత్రం అదరగొట్టాడు. టెస్టు ఫార్మాట్ లో మినహా.. వన్డే, టీ20ల్ల పాత కోహ్లీని గుర్తుచేశాడు. ఈ ఏడాది కాస్త పేలవంగా స్టార్ట్ చేసిన కోహ్లీ, ఆసియాకప్ నుంచి రూట్ మార్చేశాడు. కెప్టెన్ గా పూర్తిగా సైడ్ అయిపోవడంతో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. తను ఎంత బాగా ఆడినా సరే జట్టు మొత్తం కృషి చేస్తేనే కదా మ్యాచులు గెలిచేది. అలా కోహ్లీ సెంచరీలు చేసినా సరే టీమిండియాకు సిరీస్ కావొచ్చు, టోర్నీలో కావొచ్చు పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే కొత్త సంవత్సరం.. విరాట్ కోహ్లీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అది ఇప్పుడు అభిమానులని తెగ కంగారు పెడుతోంది.
ఇక విషయానికొస్తే.. 2022ని టీమిండియా చాలా డిసప్పాయింట్ తో ముగించింది. ఆసియాకప్, టీ20 వరల్డ్ లాంటి మెగా ఈవెంట్స్ జరిగినప్పటికీ.. ఒక్కదానిలోనూ విజేతగా నిలవలేకపోయింది. మనజట్టు ప్రదర్శన ఎలా ఉన్నప్పటికీ కోహ్లీ మాత్రం ఆకట్టుకున్నాడు. ఆసియాకప్ లో అప్గాన్ జట్టుపై సెంచరీ, టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ అద్భుతమైన ఇన్నింగ్స్.. విరాట్ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చాయి. బంగ్లాదేశ్ తో రీసెంట్ గా జరిగిన మూడో వన్డేలోనూ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే కెరీర్ పరంగా బాగానే కోహ్లీ.. టీ20లకు మాత్రం వీడ్కోలు పలకాలని చూస్తున్నాడట. ఇదే విషయాన్ని బీసీసీఐకి కూడా విరాట్ చెప్పాడని, ప్రముఖ స్పోర్ట్స్ వెబ్ సైట్ ఇన్ సైడ్ స్పోర్ట్స్ ఓ ఆర్టికల్ లో రాసుకొచ్చింది. టీ20ల కోసం తన పేరు అస్సలు పరిగణలోకి తీసుకోవద్దని కోహ్లీ చెప్పాడట. కేవలం వన్డేలు, టెస్టులకు మాత్రమే తనకు ఛాన్సులివ్వాలని కోరినట్లు సమాచారం.
ఇక జనవరి 3-7 మధ్య శ్రీలంకతో భారత్ టీ20 సిరీస్ ఆడనుంది. ఇందుకోసం బీసీసీఐ తాజాగా జట్టుని ప్రకటించగా.. అందులో కోహ్లీతో పాటు రోహిత్, జడేజా, షమి, అశ్విన్ లాంటి వారి పేర్లు లేవు. ఈ ఏడాది స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో అందరూ వన్డేలపై పూర్తి దృష్టి పెట్టనున్నారు. అందుకే కోహ్లీ.. టీ20ల నుంచి తనకు తానే తప్పుకొన్నట్లు కనిపిస్తుంది. మరోవైపు 2024లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీలో సీనియర్ల కంటే యంగ్ క్రికెటర్లని తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది.అందుకోసం హార్దిక్ కెప్టెన్సీలో కుర్రాళ్లని సానబెడుతున్నారు. కోహ్లీ తప్పుకోవడానికి ఇది కూడా ఓ రీజన్ అయ్యిండొచ్చు. ఏదేమైనా టీమిండియా తరఫున టీ20ల్లో ఎన్నో అద్భుత విజయాలు కట్టబెట్టిన కోహ్లీ.. ఇలా సైలెంట్ గా తప్పుకోవడం మాత్రం ఏం బాగోలేదు. అయితే కోహ్లీ తాత్కాలికంగానే తప్పుకొన్నాడా? లేదా పూర్తిస్థాయిలో వీడ్కోలు పలుకుతాడా అనే విషయాలపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. మరి కోహ్లీని శ్రీలంకతో టీ20 సిరీస్ కోసం, జట్టులో లేకపోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
𝗕𝗲𝘀𝘁 𝗠𝗼𝗺𝗲𝗻𝘁𝘀 𝗜𝗻 2022 @imVkohli 🥺🥀💙…#ViratKohli𓃵 #Kohli #TeamIndia pic.twitter.com/PPrX2Qypij
— Dinesh (@dinesh_viratian) December 26, 2022