ఐపీఎల్ ప్రారంభం నుంచి ఓకే జట్టుకు ఆడుతున్న విరాట్ కోహ్లీకి ఆర్సీబీతో విడదీయరాని బంధం ఉంది. అలాగే ఆ జట్టులో ఆడే ఆటగాళ్లతో కూడా కోహ్లీకి మంచి సాన్నిహిత్యం ఉంటుంది. గతంలో కోహ్లీ, ఏబీ డివిలియర్స్ మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత అంత మంచి బాండింగ్ కోహ్లీ.. ఆసీస్ స్టార్ ప్లేయర్ మ్యాక్స్‌వెల్‌తో ఏర్పడింది. వీళ్లిద్దరూ గ్రౌండ్‌లోనే కాదు.. ఆఫ్ ఫీల్డ్‌లోనూ చాలా క్లోజ్‌గా ఉంటారు.
ఐపీఎల్ 2022 సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన మ్యాక్స్‌వెల్.. మూడో మ్యాచ్ రోజుకు జట్టుతో చేరాడు. కానీ.. ప్లేయింగ్ ఎలెవన్‌లో లేడు. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం అయ్యాడు. కాగా మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ బ్యాటింగ్ సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో విరాట్ కోహ్లీ సరదాగా.. మ్యాక్స్‌వెల్‌కు మసాజ్‌చేస్తూ కనిపించాడు. వీపుపై బ్యాక్సింగ్ చేస్తూ.. భుజాలను సుతిమెత్తగా వత్తుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPL చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు!
virat kohli gives shoulder massage to glenn maxwell pic.twitter.com/e0lMs6iBnY
— Sayyad Nag Pasha (@PashaNag) April 6, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.