టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానుల అమితమైన ప్రేమను చూపిస్తాడన్న విషయం తెలిసిందే. గ్రౌండ్‌లో చాలా అగ్రెసివ్‌గా ఉండే కోహ్లీ.. బయట చాలా కాల్‌గా ఉంటాడు. ఫ్యాన్స్‌తో ఎంతో ప్రేమగా మాట్లాడటం, ఆలోగ్రాఫ్‌లు ఇవ్వడం చేస్తుంటాడు. తాజాగా ఒక ప్రత్యేక అభిమానికి కోహ్లీ గిఫ్ట్ ఇవ్వడంపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తుంది. అనధికారికంగా భారత్ జట్టులో 12వ ఆటగాడిగా పిలువబడే ధర్మ్‌వీర్ పాల్‌కు విరాట్ కోహ్లీ తన జెర్సీని బహూకరించి వీర్‌ను అమితానందంలో ముంచెత్తాడు.
విరాట్ కోహ్లీ తన 100వ టెస్టు సందర్భంగా వీర్‌కు జెర్సీని అందించాడు. శ్రీలంకతో మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్టు విరాట్ కోహ్లీకి 100వ టెస్టు అన్న విషయం తెలిసింది. దివ్యాంగుడైన వీర్.. భారత్ ఆడే మ్యాచ్‌లకు కచ్చితంగా హాజరవుతుంటాడు. అందులోనూ విరాట్ కోహ్లీని ప్రత్యేకంగా అభిమానిస్తాడు వీర్. కాగా విరాట్ వీర్‌కు తన జెర్సీ ఇవ్వడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#ViratKohli took a moment out to gift his jersey to the disabled fan before boarding the team bus. #INDvSL https://t.co/QW53Gkq5ea
— Circle of Cricket (@circleofcricket) March 7, 2022