బెంగుళూరు వేదికగా భారత్-శ్రీలంక మధ్య చిన్నస్వామి స్టేడియం జరుగుతున్న రెండో టెస్టులో విరాట్ కోహ్లీకి వింత పరిస్థితి ఎదురైంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కోహ్లీని ఉద్దేశించి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఫ్యాన్స్ ఆర్సీబీ.. ఆర్సీబీ.. అంటూ అరుస్తున్నారు. చిన్నస్వామి స్టేడియం ఆర్సీబీకి హోం గ్రౌండ్ అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక్కడ ఆర్సీబీకి ఫ్యాన్స్ ఎక్కువగా ఉండడం సహజం. ఆర్సీబీకి బ్రాండ్ అంబాసిడర్ లాంటి కోహ్లీకి అక్కడ ఇలాంటి పరిస్థితి కూడా కామనే.
కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే.. కోహ్లీ వాళ్ల అభిమానానికి రియాక్ట్ అయ్యాడు. జెర్సీ లోపల వేసుకున్న రెడ్ కలర్ టీషర్ట్‌ను చూపించాడు. ఆర్సీబీది కూడా రెడ్ కలర్ జెర్సీనే.. దీంతో సింబాలిక్‌గా అభిమానుల ఉత్సహానికి వంతపాడుతూ ఇలా తన టీ షర్ట్‌ను చూపించాడు. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ మరింత ఖుష్ అయ్యారు. కాగా జాతీయ జట్టుకు ఆడుతున్న విషయం మర్చిపోని కోహ్లీ.. ఇప్పుడు కాదు తర్వాత అంటూ సైగ చేశాడు. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 15 సీజన్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు మీ ఉత్సహాన్ని ఆపుకోండి.. త్వరలో చూపించండి అన్నట్లు కోహ్లీ ఆర్సీబీ అభిమానులకు సిగ్నల్ ఇచ్చాడు.
కాగా రాబోయే ఐపీఎల్ సీజన్‌కు విరాట్ కోహ్లీ స్థానంలో సౌతాఫ్రికా ప్లేయర్ ఫాఫ్ డుప్టెసిస్ ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. దాదాపు పదేళ్ల తర్వాత కోహ్లీ కేవలం ఒక ఆటగాడిగా ఐపీఎల్ బరిలో దిగనున్నాడు. పది సీజన్ల పాటు ఆర్సీబీకి కెప్టెన్‌గా కోహ్లీ టైటిల్ అందించనప్పటికీ కోహ్లీపై ఆర్సీబీ ఫ్యాన్స్‌కు ఉన్న క్రేజ్ తగ్గలేదు. అందుకే శ్రీలంకతో టెస్టులోనూ కోహ్లీని చూసి ఉత్సాహంతో ఆర్సీబీ.. ఆర్సీబీ అంటూ కేకలు పెడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన RCB! కోహ్లీ ఎమోషనల్ వీడియో
— Addicric (@addicric) March 12, 2022
Its not just his fan who love him he also love his fans ❤️ , RCB not only team its emotion 😊& also best fanbase franchise in world.
#RCB #ViratKohli #KingKohli #ABDevilliers #lovetorcb pic.twitter.com/NiDsi0WcxY— Abhishek Dixit (@Abhi_dixit3374) March 13, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.