టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ చాలా ఏళ్లుగా భారత జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. క్రికెట్‌ను మతంలా భావించే మన దేశంలో క్రికెటర్లను కోట్లమంది అభిమానిస్తారు. అలాగే క్రికెటర్లు కూడా తమ అద్భుత ఆటతీరుతో ప్రపంచ దేశాల ముందు ఇండియాను ఉన్నత స్థితిలో నిలుపుతారు. అలాంటి గొప్ప క్రీడాకారుల్లో విరాట్ కోహ్లీ కూడా ఒకరు.
అలాంటి వ్యక్తిని కలిసినప్పుడు అతని కంటే వయసులో పెద్దవారు కూడా చాలా మర్యాదగా, వినమ్రతతో ఉంటారు. అలాంటిది ఒక కుర్రాడు తన కాలేజ్ ఫ్రెండ్‌తో ఫొటో దిగుతున్నట్లు నిర్లక్ష్యంగా పక్కన నిల్చుని దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫొటో చూసిన క్రికెట్ ఫ్యాన్స్ ఆ కుర్రాడిపై మండిపడుతున్నారు. ‘అంత పొగరు పనికిరాదు రా బాబూ’ అంటూ హితవు పలుకుతున్నారు. నిజానికి ఆ ఫొటోలో కోహ్లీనే ఎంతో హుదాగా నిలబడితే పక్కన ఉన్న కుర్రాడు మాత్రం యారగెంట్‌గా ఉన్నట్లు తెలుస్తుంది.
For the nth time..CRAZE @imVkohli 🙏 https://t.co/WPnUj6w28M pic.twitter.com/scjPxc4vfO
— A (@_shortarmjab_) March 13, 2022
బెంగుళూరు వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట సమయంలో ఈ ఫొటో దిగినట్లు తెలుస్తుంది. కోహ్లీ లాంటి స్టార్ క్రికెటర్‌తో ఫొటో దిగడమే సాధారణ అభిమానులకు గొప్ప విషయం అయితే ఇలా దొరికి అవకాశాన్ని తన కుర్రచేష్టలతో పాడు చేసుకుని విమర్శల పాలవుతున్నాడు. ఏ వయసు వారైనా మర్యాద, హంబుల్‌నెస్‌తో ఉండాలని నెటిజన్లు అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: బెంగుళూరు టెస్టులో RCB ఫ్యాన్స్ రచ్చ! ఇప్పుడు కాదన్న కోహ్లీ
collage friend anukuntunnademo.. pic.twitter.com/jRE6WRJc2H
— Sayyad Nag Pasha (@PashaNag) March 14, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.