సోషల్ మీడియా.. సెలబ్రిటీలు, వారి అభిమానులకు మధ్య వారధిగా నిలుస్తోంది. దీని ద్వారా అభిమానులకు దగ్గరవ్వడంతో పాటు.. కోట్లలో సంపాదిస్తున్నారు సెలబ్రెటీలు. సోషల్ మీడియా ద్వారా గతేడాది టాప్-20లో ఉన్న సెలబ్రిటీల్లో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక్కడికే చోటు దక్కింది. ఆయన ఒక్కో పోస్ట్ ద్వారా ఐదు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. మరి క్రీడా విభాగానికి సంబంధించి ఇన్‌స్టా పోస్టులతో అత్యధికంగా సంపాదించిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లి ఒక్కో పోస్టుకు సుమారు 680,000 డాలర్లు(మన కరెన్సీలో దాదాపు 5.05 కోట్లు) అందుకుంటున్నాడు. కాగా.., కోహ్లికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటివరకు 177 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
ఇప్పటివరకు అనుష్క శర్మతో ఉన్న ఫొటోలు షేర్ చేసిన కోహ్లి… తన గారాల పట్టి వామిక ఫొటోను మాత్రం రివీల్ చేయలేదు. జనవరి 11 వామిక తొలి పుట్టిన రోజు నేపథ్యంలో ఇప్పటికైనా చిన్నారి రూపాన్ని తమకు చూపిస్తాడని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలా చేస్తే ఫాలోవర్లు కూడా భారీగా పెరుగుతారంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. ఇక చివరిసారిగా తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ఆమెతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు కోహ్లి. ప్రస్తుతం కోహ్లి దక్షిణాఫ్రికా టూర్‌లో ఉన్నాడు. గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన కోహ్లి..మూడో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.