బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో పంత్, జడేజా సెంచరీలతో చెలరేగడంతో భారత్ 416 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఇంగ్లండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బౌలర్లు 257 పరుగులకే కట్టడి చేశారు. 127 పరుగుల లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 3 వికెట్లు కోల్పోయి 125 పరుగుల వద్ద మూడో రోజు ఆటను ముగించింది. ప్రస్తుతం టీమిండియా 257 పరుగుల ఆధిక్యంలో ఉంది. దీనికి మరో 150 పైచిలుకు పరుగులు జోడించి ఇంగ్లండ్‌ను రెండో ఇన్నింగ్స్ ఆహ్వానిస్తే భారత్ విజయావకాశాలు మరింత మెరుగవుతాయి.
కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా పటిష్టస్థితిలో ఉన్నా.. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం ఫామ్ అందుకోలేకపోతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 11 పరుగులకే వెనుదిరిగిన కోహ్లీ.. సెకండ్ ఇన్నింగ్స్‌లో 20 పరుగులకే పరిమితమయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో తెలుగు క్రికెటర్ హనుమ విహారి(11) ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. తనదైన కవర్ డ్రైవ్స్‌తో జోరు మీద కనిపించాడు. బ్యాటింగ్ చేస్తున్నంత సేపు మంచి టచ్‌లో కనిపించినా.. స్టోక్స్ బౌలింగ్ విరాట్ కోహ్లీ.. జోరూట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఏకైక టెస్టులో విరాట్ కోహ్లీ విఫలం అయ్యాడు.
దాదాపు మూడేళ్ల నుంచి ఒక్క సెంచరీ కూడా లేని కోహ్లీ ఫామ్ అందుకోవాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయినా కూడా ఫలితం లేకుండా పోతుంది. దీంతో విరాట్ కోహ్లీ పని అయిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బ్యాడ్ ఫామ్‌తో జట్టుకు భారంగా మారేకంటే రిటైర్మెంట్ తీసుకోవడం మంచిదని కొంత మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. టెస్టుల నుంచి విశ్రాంతి తీసుకుని.. టీ20, వన్డేల ఫోకస్ పెడితే కనీసం రాబోయే టీ20 వరల్డ్ వరకైనా జట్టులో స్థానం కోల్పోకుండా ఉంటాడని కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్‌సైతం అభిప్రాయపడుతున్నారు.
విరాట్ కోహ్లీ టెస్టుల్లో తన చివరి సెంచరీ 2019లో బంగ్లాదేశ్‌పై చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కోహ్లీ బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ రాలేదు. కోహ్లీ సామర్థ్యం గురించి ఎవరీ ఎలాంటి అనుమానాలు లేనప్పటికీ.. ప్రస్తుతం అతనికి బ్యాడ్ టైమ్ నడుస్తుంది. ఈ సమయంలోనే టీమిండియాలో చోటు కోసం చాలా మంది యువ క్రికెటర్లు ఎదురుచూస్తున్నారు. వారికి అవకాశం కల్పించేందుకైనా కోహ్లీ టెస్టుల నుంచి తప్పుకోవాలనే డిమాండ్ వినిపిస్తుంది. చాలా కాలం పాటు ఇండియన్ క్రికెట్‌లో తిరుగుని ఆటగాడిగా ఒక వెలుగువెలిగిన విరాట్ కోహ్లీ ప్రస్తుత ఫామ్, రిటైర్మెంట్ తీసుకోవాలనే వాదనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
*
Once again Chokli gone 💔#ViratKohli #ENGvsIND #INDvENG pic.twitter.com/LGqeWxtvY7— Ash…. Rohitian (@Rohitian45a) July 3, 2022