టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్, ఛేజ్ మాస్టర్, కింగ్ కోహ్లీ.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో ఒక లెజెండ్. 14 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి.. అలుపెరగకుండా పరుగుల వరదపారిస్తున్నాడు. తన అద్భుత బ్యాటింగ్‌తో టీమిండియా ఒంటిచేత్తో ఎన్నో విజయాలు అందించాడు. కెప్టెన్‌గా కూడా టీమిండియా విజయవంతంగా నడిపించి.. టెస్టుల్లో తిరుగులేని శక్తిగా మార్చాడు. ఆటగాడిగా ఎవరీ అందనంత ఎత్తుకు ఎదిగిన కోహ్లీ.. రికార్డుల మోతమోగించాడు. సెంచరీలు చేకుండా.. 60లు 70లు కొడితే, కోహ్లీ ఫామ్‌లో లేడని భ్రమ పడే స్థాయిలో తన స్టాండెడ్స్‌ను ఉంచుకున్నాడు కింగ్ కోహ్లీ. మొత్తానికి ఆ 71వ సెంచరీ కరువు ఆసియా కప్‌లో తీర్చుకుని.. వరల్డ్ కప్ వేటలో బరిలోకి దిగి, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై పంజా విసిరాడు. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాసే గర్జన కన్నా భయంకరంగా ఉంటే.. ఇక దాని గర్జన ఏ స్థాయిలో ఉంటుందో.. పాక్‌కు రూచిచూపించాడు.
టీ20 వరల్డ్ కప్ 2022లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయానికి చివరి 8 బంతుల్లో 28 పరుగులు కావాలి. అప్పటికే తొలి నాలుగు బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చిన బౌలర్ ఎదురుగా ఉన్నాడు. విజయం దాదాపు దూరమైనట్లు కనిపించింది. కానీ.. స్ట్రైక్‌లో కోహ్లీ ఉన్నాడులే.. అనే ఆశ తప్ప, మ్యాచ్ కచ్చితంగా గెలుస్తామనే నమ్మకం ఎవరిలోనూ లేదు. ఇక పాకిస్థాన్ ఆటగాళ్ల కళ్లల్లో అయితే అప్పటికే మ్యాచ్ గెలిచేసిన ఆనందం. అదే ఆనందంతో ఐదో బంతిని షార్ట్ పిచ్‌గా సంధించాడు.. హరీస్ రౌఫ్. ఆ బాల్‌ను ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటివరకు ఏ క్రికెటర్ ఆడని, భవిష్యత్తులో కూడా ఆడలేని షాట్ ఆడాడు కోహ్లీ. ఆ ఒక్క షాట్‌తో పాక్ నవ్వులు నేలరాలాయి. స్ట్రేయిట్‌గా సిక్స్.. అసలు ఆ షాట్ ఎలా ఆడాడో అని ఆశ్చర్యంలో ఉన్నలోపే ఫైన్‌లెగ్ మీదుగా మరో భారీ సిక్స్. దెబ్బకు మ్యాచ్ మన చేతుల్లోకి వచ్చేసింది.
ఇక చివరి ఓవర్‌లో 16 పరుగులు అవసరమైన సమయంలోనూ కోహ్లీ భారీ సిక్స్, అశ్విన్ తెలివితో టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2022 తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై చిరస్మరణీయ విజయం సాధించింది. ఆ విజయం.. విరాట్ కోహ్లీ అంటే మరోసారి ప్రపంచానికి చూపించింది. అతన్ని రన్ మెషీన్, ఛేజ్ మాస్టర్, కింగ్ కోహ్లీ అని ఎందుకు పిలుస్తారో అర్థమైంది. వరల్డ్ కప్‌లో తొలి మ్యాచే అయినా.. వరల్డ్ కప్ గెలిస్తే వచ్చే ఆనందం కంటే.. వందరెట్ల సంతోషాన్ని భారత క్రికెట్ అభిమానులు పొందారు. కోహ్లీ ఆడిన ఆ ఇన్నింగ్స్.. ఇండియన్ క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అలాంటి ఉద్విగ్న క్షణాలను క్రికెట్ అభిమానుల కళ్లల్లో ఇంకా అలా మెదులుతూనే ఉన్నాయి.
ఆ మరుపురాని, మరువలేని, మధురమైన ఇన్నింగ్స్ ఆడి నెల రోజులైన తర్వాత.. మరోసారి ఆ రోజును గుర్తు చేసుకున్నాడు కింగ్ కోహ్లీ. పాకిస్థాన్‌పై ఆడిన తన ఇన్నింగ్స్‌పై ఎమోషనల్ అవుతూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘అక్టోబర్ 23, 2022 నా హృదయంలో ప్రత్యేకంగా ఉంటుంది. క్రికెట్‌లో అలాంటి ఎనర్జీని గతంలో ఎప్పుడూ నేను పొందలేదు. ఆ సాయంత్రం ఎంతో బ్లెస్సింగ్‌తో కూడినది’ అని కోహ్లీ పోస్టులో పేర్కొన్నాడు. కాగా.. ఈ ఇన్నింగ్స్ గురించి ఆ రోజు స్పందించిన కోహ్లీ.. తన టీ20 కెరీర్‌లో బెస్ట్ ఇన్నింగ్స్‌గా నిలుస్తుందని చెప్పిన విషయం తెలిసిందే. అయితే.. తొలి మ్యాచ్‌లో అద్భుత విజయం అందుకున్న టీమిండియా.. సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడి నిరాశ పర్చింది.
October 23rd 2022 will always be special in my heart. Never felt energy like that in a cricket game before. What a blessed evening that was 💫🙏 pic.twitter.com/rsil91Af7a
— Virat Kohli (@imVkohli) November 26, 2022