భారత్-సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ మంచి ఆరంభం ఇచ్చినా.. దాన్ని బిగ్ స్కోర్‌గా మలచలేకపోయారు. ధావన్ 29 పరుగుల చేసి అవుట్ అయ్యాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. మహరాజ్ బౌలింగ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమాకు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు.
దీంతో విరాట్ చాలా నిరాశగా కనిపించాడు. కానీ ఆ తర్వాత రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ మంచి భాగస్వామ్యం నెలకొల్పడంతో.. అంతా రిలాక్స్‌గా కనిపించారు. కోహ్లీ కూడా డ్రెస్సింగ్ రూమ్‌లో చాలా హ్యాపీగానే కనిపించాడు. ఏకంగా డాన్స్ వేస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి కోహ్లీ డాన్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: విరాట్ కోహ్లీపై కఠిన చర్యలకు సిద్ధమైన గంగూలీ!
#SAvIND #Virat Kohli enjoying and dancing.😂🤣😂🤣 #Viratvsbcci #ViratKohli #ViralVideo #BCCI #INDvsSA pic.twitter.com/R7e2BmcSl6
— Ravi Maurya🇮🇳 (@Killmonnger) January 21, 2022