రన్ మెషీన్ విరాట్ కోహ్లీ తర్వాత టీమిండియా పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ సిరీస్‌లపై సిరీస్‌లు క్లీన్‌స్వీప్ చేసుకుంటూ పోతున్నాడు. అతని వ్యూహాలకు నిరంతరం ప్రశంసలు అందుతున్నాయి. కాగా, రోహిత్ శర్మ కెప్టెన్సీపై విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ చాలా ప్రశాంతమైన కెప్టెన్ అని, అయితే కెప్టెన్‌గా అతనికి చిన్న జట్లతో సులువుగా సిరీస్‌లు ఎదురుపడ్డాయని రాజ్‌కుమార్ శర్మ అన్నాడు. టీమిండియా సిరీస్ ఓడిపోతే రోహిత్ శర్మకు అసలైన పరీక్ష మొదలవుతుందని రాజ్‌కుమార్ పేర్కొన్నాడు. ఒకసారి టీమిండియా ఓడిపోతే అప్పటి నుంచి ఆరోపణల పర్వం మొదలవుతుంది. అలా కాకుండా టీమిండియా ప్రదర్శన ఇలాగే కొనసాగుతుందని భావిస్తున్నామని, అయితే ఫలితం ప్రతికూలంగా వచ్చినప్పుడే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి అని చెప్పుకొచ్చాడు.
రోహిత్ శర్మ సరిగ్గా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బాటలోనే నడుస్తున్నాడని రాజ్ కుమార్ శర్మ అన్నాడు. రోహిత్ శర్మ ప్రతి యువ ఆటగాడికి మంచి డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. నువ్వు తెలివైనవాడివి, కాబట్టి టీమిండియాకు చేరుకున్నావు అంటూ యువతకు రోహిత్ శర్మ భరోసా ఇస్తున్నాడు. ఒక యువ ఆటగాడు మంచి డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం. రోహిత్ శర్మ ఈ ప్రాక్టీస్‌ను ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇది గంగూలీ కెప్టెన్సీలో ప్రారంభమైందని అనుకుంటున్నాను అని పేర్కొన్నాడు. శుక్రవారం నుంచి శ్రీలంకతో ప్రారంభ కానున్న టెస్టుతో రోహిత్‌శర్మ పూర్తిస్థాయి కెప్టెన్‌గా తొలి టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కాగా స్వదేశంలో కాకుండా విదేశాల్లో టెస్టుల్లో రోహిత్ కెప్టెన్సీ సామర్థ్యం బయటపడుతుందనే వాదన కూడా ఉంది. మరి రోహిత్ శర్మ కెప్టెన్సీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ROHIT SHARMA GOAT 🔥
#RohitSharma𓃵 | @ImRo45 pic.twitter.com/2JHvXTm8qI
— ROHIT TV™ (@rohittv_45) February 23, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.