ఆసియా కప్ 2022లో భాగంగా సూపర్ ఫోర్‌లో టీమిండియా కీలక పోరుకు సిద్ధమైంది. గ్రూప్ స్టేజ్‌లో రెండు వరుస విజయాలతో దూకుడు చూపించిన భారత్.. సూపర్ ఫోర్‌లో మాత్రం పాక్ చేతిలో అనూహ్య ఓటమి చవిచూసింది. దీంతో నేడు(మంగళవారం సెప్టెంబర్ 6) శ్రీలంకతో డూ ఆర్ డై మ్యాచ్ ఆడే పరిస్థితి తెచ్చుకుంది. కాగా.. పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీపై విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీపక్ హుడాతో బౌలింగ్ చేయించకపోవడాన్ని రాజ్‌కుమార్ తప్పుబట్టారు. అతనిపై అంత నమ్మకం లేనప్పుడు జట్టులోకి ఎందుకు తీసుకున్నారంటూ ప్రశ్నించాడు.
రాజ్‌కుమార్ శర్మ మాట్లాడుతూ..‘పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో దీపక్ హుడాను ఆరో బౌలింగ్ ఆప్షన్‌గా తీసుకున్నట్లు అర్థమవుతుంది. పాక్ జట్టు లెఫ్ట్ హ్యాండర్ మొహమ్మద్ నవాజ్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు పంపినప్పుడు.. ఆఫ్‌స్పిన్నర్‌గా ఉన్న దీపక్ హుడాతో రెండు ఓవర్లు వేయించాల్సింది. అతను కచ్చితంగా నవాజ్‌ను ఇబ్బంది పెట్టేవాడు. దీపక్ హుడాకు టీ20 క్రికెట్‌లో చక్కగా బౌలింగ్ చేసిన అనుభవం ఉంది. అయినా కూడా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హుడాను బౌలింగ్ ఆప్షన్‌గా అసలు భావించలేదు. ఇది కచ్చితంగా టీమిండియా ఓటమికి ఒక కారణం.’ అని రాజ్‌కుమార్ అన్నారు. రాజ్‌కుమార్ అన్నట్లు పాక్‌తో మ్యాచ్‌లో దీపక్ హుడాతో బౌలింగ్ చేయించాల్సిందని క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడ్డారు.
మిగతా బౌలర్లు ధారాళంగా పరుగులు ఇస్తున్నా.. రోహిత్ ఆరో బౌలింగ్ ఆప్షన్‌కు వెళ్లలేదు. ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లు, ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగిన టీమిండియా.. దీపక్ హుడాను తుది జట్టులోకి తీసుకోవడంతో పాండ్యాతో పాటు అతను కూడా బౌలింగ్ చేస్తాడని అంతా భావించారు. కానీ.. రోహిత్ అతని చేతికి బంతి ఇవ్వలేదు. పైగా టాపార్డర్ బ్యాటర్ అయిన దీపక్‌ను డెత్ ఓవర్స్‌లో బ్యాటింగ్‌కు దింపారు. అతని ప్లేస్‌లో భీకర ఫామ్‌లో ఉన్న దినేష్ కార్తీక్ జట్టులో ఉన్నా చివరి ఓవర్స్‌లో రన్స్ వచ్చేవి. కానీ.. బౌలింగ్ చేస్తాడనే కారణంతో డీకే ప్లేస్‌లో దీపక్‌ను తీసుకున్నరని క్రికెట్ నిపుణులు భావించారు. కానీ.. రోహిత్ శర్మ దీపక్‌ను కేవలం బ్యాటింగ్ వరకే పరిమితం చేశాడు. పాకిస్థాన్‌పై టీమిండియా తొలుత బ్యాటింగ్ 181 పరుగుల మంచి టార్గెట్ సెట్ చేసిన బౌలింగ్ వైఫల్యంతోనే మ్యాచ్ ఓడింది. మరి రోహిత్ శర్మ కెప్టెన్సీ నిర్ణయంపై కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: టీ20ల్లో టాప్ 5 క్రికెటర్లను ప్రకటించిన పాంటింగ్! భారత్ నుంచి ఇద్దరు..
IND vs PAK 2022: “This indicates that the captain doesn’t have enough faith in him” – Rajkumar Sharma on Rohit Sharma not giving an over to Deepak Hooda https://t.co/RR5FABtchE
— WORLD NEWS LAND (@WORLDNEWSLAND1) September 5, 2022