సాధారణంగా కోహ్లీ సెలెబ్రేషన్ సెంచరీ తర్వాత ఉంటుంది.కానీ విండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి ఫోర్ కొట్టిన కోహ్లీ సెంచరీ చేసినట్లుగా ప్రవర్తించాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజ్ లో ఉంటే బౌండరీల వర్షం కురవాల్సిందే. బౌలర్ ఎవరైనా, ఫార్మాట్ ఏదైనా కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే బౌలర్లు కూడా ఒత్తిడిలోకి వెళ్ళిపోతారు. భారీ ఇన్నింగ్స్ లు ఆడటం విరాట్ కి వెన్నతో పెట్టిన విద్య. అలాంటి విరాట్ కోహ్లీ కొంతకాలంగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో కోహ్లీ ఆట ఏమంత గొప్పగా లేదు. ప్రస్తుతం ఒక భారీ ఇనింగ్స్ కి బాకీ పడిన కోహ్లీ.. వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఆ దిశగా అడుగులేస్తున్నాడు. అయితే రెండో రోజు ఆటలో భాగంగా కోహ్లీ చేసిన ఒక చర్య ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒక్క ఫోర్ కొట్టి సంబరాలు చేసుకోవడం అందరికి కొత్తగా అనిపించింది. మరి దీని వెనుక కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా కోహ్లీ సెలెబ్రేషన్ సెంచరీ తర్వాత ఉంటుంది.కానీ విండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి ఫోర్ కొట్టిన కోహ్లీ సెంచరీ చేసినట్లుగా ప్రవర్తించాడు. క్రీజ్ లో ఉన్నంతవరకు వికెట్ కి ప్రాధాన్యమిచ్చిన విరాట్.. ఈ క్రమంలో ఫోర్ కొట్టే ప్రయత్నం అస్సలు చేయలేదు. అయితే చివరికి కోహ్లీ ఫస్ట్ బౌండరీ కొట్టడానికి 81 బంతులు అవసరమయ్యాయి. ఇక ఈ బౌండరీ కొట్టిన అనంతరం యెస్ యెస్.. నేను సాధించాను అనే విధంగా నవ్వుతూ డగౌట్‌లో ఉన్న సహచర ఆటగాళ్లకు సంజ్ఞ చేస్తూ కనిపించాడు. ఇక ఈ ఇన్నింగ్స్ ద్వారా కోహ్లీ టెస్టుల్లో 8500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న కోహ్లీ తనను తాను మోటివేట్ చేసుకోవడానికే ఇదంతా చేసి ఉంటాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఓవర్ నైట్ స్కోర్ 80/0 రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, జైస్వాల్ క్రీజ్ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ క్రీజ్ లో పాతుకుపోవడంతో విండీస్ కి ఒకదశలో వికెట్ వస్తుందా అనే అనుమానాలు వచ్చాయి. ఎట్టలకే 229 పరుగుల భాగస్వామ్యం తర్వాత 103 పరుగులు చేసిన రోహిత్ శర్మ అతనాజ్ బౌలింగ్ లో కీపర్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఇక ఆ తర్వాత వచ్చిన శుభమన్ గిల్ కేవలం 6 పరుగులే చేసి నిరాశపరిచాడు. ఇక జైస్వాల్(143) తో జత కలిసిన కోహ్లీ(36).. మరో వికెట్ పడకుండా రెండో రోజుని ముగించారు. మొత్తానికి ఫస్ట్ ఫోర్ కొట్టి కోహ్లీ సెలబ్రేట్ చేసుకోవడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
King Kohli completed 8500 runs in test cricket with that boundary. #ViratKohlipic.twitter.com/ZC8CIgtbJ7
— Mufaddal Vohra (@133_AT_Hobart) July 14, 2023